జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున హరితహారం లక్ష్యం నెరవేరేలా అధికారులు కృషిచేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సూచించారు. ఖమ్మం ఆర్టీవో కార్యాలయంలో ఆరో విడత హరిత హారంలో భాగంగా మొక్కలు మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో కలియ తిరిగారు.
హైదరాబాద్‌తో సమానంగా ఖమ్మం ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రత్యేక టెస్టింగ్ ట్రాక్‌ను ఏర్పాటుచేస్తామని తెలిపారు. సిమిలేటర్ ద్వారా డ్రైవింగ్ అనుభవం వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నటు వివరించారు. జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులందరూ హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: భయం భయం: ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా వణుకు