తడి, పొడి చెత్త వేరు చేసే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపడితే... స్వచ్ఛ ఖమ్మం నగరం కల వీలైనంత త్వరలో సాకారమవుతుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా స్వయం సహాయక సంఘాలు.. ఈ బాధ్యతను తమ భుజస్కందాలపై వేసుకోవాలని సూచించారు.
నగరంలో ఉన్న 75 వేల గృహాల్లో ప్రతీ ఇంటికి తడి, పొడి చెత్త బుట్టలు అందించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఖమ్మం నగరంలోని పెవిలియన్ మైదానంలో కలెక్టర్ కర్ణన్, మేయర్ పాపాలాల్తో కలిసి తడి, పొడి చెత్త బుట్టలను మంత్రి పంపిణీ చేశారు.