KTR Visit Khammam: ఖమ్మంలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ పర్యటించనున్నారు. నగరంలో సుమారు రూ. 90 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించనున్నారు. రూ. 22కోట్లతో నిర్మించిన నూతన నగర పాలక సంస్థ కార్యాలయ భవనాన్ని కేటీఆర్ ప్రారంభిస్తారు. నగరంలోని శ్రీనివాసనగర్‌లో రూ. 30కోట్లతో నిర్మించిన మురుగునీటి శుద్ధీకరణ ప్లాంటు, దానవాయిగూడెంలో రూ. 6కోట్లతో నిర్మించిన మానవ వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటును పురపాలక శాఖ ప్రారంభిస్తారు. వీటితోపాటు ట్యాంక్‌బండ్‌పై రూ. 9 కోట్లతో చేపట్టిన తీగలం వంతెనను ప్రారంభించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం అనంతరం.. సర్దార్ పటేల్ స్డేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో మంత్రి పాల్గొననున్నారు.
ఇదీ చదవండి: