ETV Bharat / city

తెరవెనుక  మంత్రాంగం... ప్రలోభాలే ఆఖరి అస్త్రం - 2019 elections

ఓవైపు ప్రచండ భానుడి భగభగలు... మరోవైపు ఎన్నికల ప్రచార సెగలతో ఖమ్మం వేడిక్కింది. రోడ్​షోలు, సుడిగాలి పర్యటనల హోరు ముగిసింది. తెరవెనుక మంత్రాంగంతో ఓటర్లను ఆకర్షించేదుకు పడరాని పాట్లు పడుతున్నారు. కారు, హస్తం మధ్య హోరాహోరీ పోరు సాగుతుండగా... కమలం, కమ్యూనిస్టులు కూడా శక్తిమేర ప్రయత్నిస్తున్నారు.

ఖమ్మంలో తెరవెనుక మంత్రాంగం
author img

By

Published : Apr 9, 2019, 4:27 PM IST

ఖమ్మం లోక్​సభ నియోజకవర్గంలో ప్రచార పర్వం తుది అంకానికి చేరుకుంది. గత నెల 25న నామినేషన్ల ప్రక్రియ ముగిసిన మరుసటి రోజు నుంచి నిర్విరామంగా సాగింది. మాటల తూటాలతో ఖమ్మం రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. తెరాస తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ మినహా... ఇతర పార్టీల అగ్రనేతలెవరూ ఇక్కడ అడుగుపెట్టలేదు. అయినా... అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

అభివృద్ధి కావాలంటే...

అభివృద్ధి మంత్రం జపిస్తున్న తెరాస... ఈ సారి ఎలాగైనా ఖమ్మం లోక్​సభపై గులాబీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంగా ముందుకెళ్తోంది. జిల్లా నేతలంతా ఏకతాటిపైకి వచ్చి ప్రచారం నిర్వహించారు. తెరాస నేతలకు తోడు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా తెరాస అభ్యర్థి గెలుపుకోసం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఖమ్మం ఎంపీగా నామ నాగేశ్వరరావు గెలిస్తేనే... జిల్లా అభివృద్ధి ముందుకు సాగుతుందన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పిస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తి, బయ్యారం ఉక్కు పరిశ్రమ ప్రారంభం తెరాసతోనే సాధ్యమంటూ హామీలిస్తున్నారు.

ఒంటి చేత్తో...

ఖమ్మంలో కాంగ్రెస్ విజయానికి అభ్యర్థి రేణుకా చౌదరి అన్నీ తానై ముందుండి నడిపిస్తున్నారు. అగ్రనేతల పర్యటనలు లేకున్నా.. ముఖ్యనేతలు కండువాలు మారుస్తున్నా, అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నా.. మొక్కవోని దీక్షతో ముందుకెళ్లారు. ఖమ్మంలో ప్రజలకు, ఫిరాయింపుదారులకు మధ్య పోరాటం జరుగుతోందని సరికొత్త ప్రచారానికి తెరదీశారు. వివిధ సంఘాల మద్దతు కోరుతూ... ప్రచార సభలు, రోడ్​షోలతో తనదైన శైలిలో రేణుక చౌదరి ప్రచారం సాగించారు.

లెఫ్ట్-రైట్

ఒకప్పుడు కమ్యూనిస్టుల అడ్డగా ఉన్న ఖమ్మంలో... సత్తా చాటాలనే లక్ష్యంతో వామపక్షాలు ప్రజల్లో వెళ్లాయి. పార్లమెంట్‌లో ప్రజల గొంతుక వినిపించాలంటే... సీపీఎం అభ్యర్థికి ఓటేయాలంటూ ప్రజలను అభ్యర్థించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఉన్న సోదరపక్షం సీపీఐ ఇప్పుడు తమకు మద్దతివ్వటం కలిసొచ్చే అంశంగా సుత్తీకొడవలి పార్టీ చెబుతోంది.

వ్యాపారస్తులకు రాజకీయాల్లో తావివ్వకుండా ప్రజలు జాగ్రత్త పడాలంటూ భారతీయ జనతా పార్టీ ప్రచారం నిర్వహిస్తోంది. మార్పు, విలువలతో కూడిన రాజకీయాల కోసం డబ్బు మద్యానికి స్వస్తి పలకాలని అవగాహన కల్పించారు.

ఇవీ చూడండి: మూడు రాష్ట్రాల సరిహద్దులో గెలుపెవరిది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.