ETV Bharat / city

ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న వేళ రసవత్తరంగా పోరు - telangana varthalu

నిర్దేశించిన గడువులోపే... నగరపాలక ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న వేళ.. ఖమ్మం బల్దియా పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలంటూ పురపాలక శాఖకు ఎన్నికల సంఘం రాసిన లేఖతో.. ఖమ్మం నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం ఆ దిశగా కసరత్తును మరింత ముమ్మరం చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇదే సమయంలో రాజకీయ పార్టీలన్నీ...ఎన్నికల పోరుపై మరింత దృష్టి సారిస్తున్నాయి.

ఎన్నికల సంఘం సమాయత్తమవుతున్న వేళ రసవత్తరంగా పోరు

author img

By

Published : Jan 3, 2021, 4:32 AM IST

ఖమ్మం, వరంగల్ నగరపాలక సంస్థలతోపాటు మరో 4 పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కార్యాచరణ మరింత ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు నిర్దేశించిన గడువులోపే ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లకు సమాయత్తమవుతోంది. ఎన్నికలకు కీలకమైన డివిజన్ల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖకు ఎన్నికల సంఘం లేఖ రాయడంతో.. ఎన్నికలపై రాజకీయ వేడి మరింత రాజుకుంటోంది. ఖమ్మం నగరపాలకంలో ప్రస్తుతం 50 డివిజన్లు ఉండగా.. కొత్త పురపాలక చట్టం ప్రకారం డివిజన్ల సంఖ్య 60కి పెరగనుంది. దీంతో..ఉన్న 50 డివిజన్లనే మరో 10 డివిజన్లు పెంచేలా అధికార యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే అందిన ప్రాథమిక సమాచారంతో డివిజన్లలో ఎంత మేర ఓటర్ల సంఖ్య ఉండాలి. పెద్ద డివిజన్లలో ఓటర్ల సంఖ్యను ఎలా తగ్గించాలన్న అంశాలపై కసరత్తులు చేసిన అధికారులు... పునర్విభజన పై ఆదేశాలు రాగానే.. ప్రక్రియను మరింత ముమ్మరం చేయనున్నారు.

ధీమాతో తెరాస

ఖమ్మం కార్పొరేషన్ కు 2016 మార్చి 6 ఎన్నికలు జరగగా.. మార్చి 15న కొత్త పాలకవర్గం కొలువుదీరింది. 2021 మార్చి 15తో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇక త్వరలోనే ఎన్నికల నగారా మోగుతుందన్న వార్తల నేపథ్యంలో.. రాజకీయ పక్షాలన్నీ ఎన్నికల భేరీకి సై అంటున్నాయి. గత ఎన్నికల్లో 50 డివిజన్లకు గానూ 34 స్థానాలు గెలుచుకున్న తెరాస.. బల్దియాపై గులాబీ జెండా ఎగురవేసింది. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతో నగరపాలక సంస్థలో ప్రస్తుతం తెరాసకు 42 మంది కార్పొరేటర్ల బలం ఉంది. కాంగ్రెస్ 3, సీపీఎం-2, సీపీఐ-2, తెదేపా-1 చొప్పున కార్పొరేటర్లు ఉన్నారు. ఈ సారి ఎన్నికలు అధికార పక్షం సహా మిగతా ప్రతిపక్ష పార్టీలన్నింటికీ ప్రతిష్టాత్మకంగా మారుతుండటం వల్ల రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో పువ్వాడ అజయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. గతంలో నిర్వహించిన పార్టీ అంతర్గత సర్వేతో అధికార పీఠం ఖాయమన్న ధీమాతో తెరాస ఉంది.

సత్తా చాటేందుకు ప్రతిపక్షాలు సైతం...

ప్రతిపక్ష పార్టీలు సైతం బల్దియా పోరులో సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో తరచూ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. నగరంలో ఎన్నికల కోసం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. దుబ్బాక గెలుపు, గ్రేటర్‌లో సత్తా చాటి ఊపు మీదున్న భాజపా సైతం ఈసారి ఖమ్మంలో సత్తా చాటాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిని ఇంఛార్జిగా నియమించిన భాజపా.. సమన్వయ సమావేశాలకు శ్రీకారం చుట్టింది.

రాజకీయ వేడి

సీపీఎం, సీపీఐ, తెదేపా సైతం.. ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి.. మొత్తంగా డివిజన్ల పునర్విభజన ప్రక్రియకు త్వరలోనే మొదలుకానుండటంతో.. నగరంలో రాజకీయ కాక మరింత రాజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇదీ చదవండి: సాంకేతికాభివృద్ధిలో కృత్రిమ మేధ పాత్ర ఎంతో కీలకం: మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.