ETV Bharat / city

భద్రాద్రి వద్ద గోదావరికి వరద ముంపు.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ - భద్రాచలం న్యూస్ అప్​డేట్స్

Godavari heavy flow in Bhadrachalam: రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీవర్షాలతో గోదావరి మళ్లీ ఉధృతంగా మారింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో మళ్లీ భద్రాద్రి వద్ద నీటిమట్టం భారీగా పెరుగుతూ సాయంత్రానికి 45 అడుగులకు చేరింది. అధికారులు ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

Godavari
Godavari
author img

By

Published : Sep 12, 2022, 7:49 PM IST

Godavari heavy flow in Bhadrachalam: గోదావరి మళ్లీ మహోగ్రరూపం దాలుస్తోంది. అల్పపీడన ద్రోణి, రుతువపనాల ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గత 48 గంటల్లో భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండుకోవడంతో.. వచ్చిన వరదను వచ్చినట్లే కిందకు వదులుతున్నారు. ఎగువన నుంచి వస్తున్న ప్రవాహంతో భద్రాచలం వద్ద నీటిమట్టం నిన్నటి నుంచి పెరుగుతూ వస్తోంది. ఆదివారం ఉదయం 32 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం 24 గంటల్లో 40 అడుగులను దాటింది. మధ్యాహ్నం 3 గంటలకు 43 అడుగులకు చేరింది. పరిస్థితిని సమీక్షించిన అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

సాయంత్రానికి నీటిమట్టం 45 అడుగులకు చేరింది. ప్రస్తుతం భద్రాద్రి వద్ద నీటి ప్రవాహం 10 లక్షల 18వేల క్యూసెక్కులుగా ఉంది. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలనీ జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాలు జారీ చేశారు. ఎగువన వర్షాలు పడుతుండటంతో.. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లా కలెక్టరేట్​లో 08744-241950, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 08743-232444 నంబర్లతో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఇవీ చదవండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.