ETV Bharat / city

అవార్డులు దక్కించుకున్న ఆస్పత్రి... ప్రసవం చేయలేకపోతోంది...!

రోజుకు 20 నుంచి 30 ప్రసవాలు. నెలకు దాదాపు 500 వరకు కాన్పులు. కాయకల్ప అవార్డుతో ఆదర్శంగా నిలిచిన ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిపై కరోనా తీవ్ర ప్రభావమే చూపుతోంది. ప్రసూతి విభాగంలోని వైద్యులు, సిబ్బందిలో అత్యధిక మంది కరోనా బారినపడి హోం ఐసోలేషన్​కే పరిమితం కావటం వల్ల తొలిసారిగా ప్రసూతి సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా వైద్యం కోసం వస్తున్న గర్భిణులకు ప్రసవ వేధన తప్పట్లేదు.

author img

By

Published : Aug 8, 2020, 3:26 AM IST

delivery problems in khammam government hospital
delivery problems in khammam government hospital
అవార్డులు దక్కించుకున్న ఆస్పత్రి... ప్రసవం చేయలేకపోతోంది...!

మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల ఆడబిడ్డల ప్రసవాలకు చిరునామాగా నిలిచిన ఖమ్మం ప్రభుత్వాస్పత్రి కరోనా దెబ్బకు కకావికలమవుతోంది. పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందక రోగులకు కష్టాలు తప్పట్లేదు. ఇప్పటికే ప్రధానాసుపత్రిలో పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది వైరస్‌ బారినపడగా... వారి ప్రైమరీ కాంటాక్టుగా ఉన్నవారు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలోనే కొవిడ్ సెంటర్, బాధితులకు ఐసోలేషన్ వార్డు ఏర్పాటుతో చికిత్స చేసేందుకు వైద్యసిబ్బంది, ఆస్పత్రికి వచ్చేందుకు రోగులు వెనకడుగు వేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితితో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతుంటే... ఆస్పత్రిలో మరో విభాగం కొవిడ్ దెబ్బతో విలవిల్లాడుతోంది.

పూర్తిగా నిలిపివేసిన ప్రసూతి సేవలు...

ఖమ్మం ఆస్పత్రిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలోనే ప్రసవాల్లో ఇక్కడి ఎంసీఎచ్​ ప్రథమస్థానం దక్కించుకుంది. రోజుకు 20 నుంచి 30 ప్రసవాలతో....... నెలకు దాదాపు 500 నుంచి 600 కాన్పులతో అగ్రభాగాన ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచే కాకుండా ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి వచ్చే నిరుపేదలకు భరోసానిస్తోంది. ఓవైపు కాన్పులు మరోవైపు రోజూ, నెలవారీ పరీక్షలకు వచ్చే గర్భిణులతో కళకళలాడే ఆస్పత్రిలో ఇప్పుడు కరోనా దెబ్బకు ప్రసూతి సేవలను పూర్తిగా నిలిపివేశారు. అవుట్ పేషెంట్లకు మాత్రమే సేవలందిస్తున్నారు. కాన్పు కోసం వచ్చే వారిని మమత జనరల్ ఆస్పత్రికి సిఫారసు చేస్తున్నారు.

70 శాతం మంది విధులకు దూరం...

ఖమ్మం ఆసుపత్రిలోని ప్రసూతి విభాగాన్ని మహమ్మారి కకావికలం చేసింది. ఆస్పత్రిలో ఐదుగురు వైద్యనిపుణులుండగా... ఒక్కొక్కరూ కొంతకాలంగా కరోనా లక్షణాలతో విధులకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రసవాలు చేసే నిపుణుల కొరత తీవ్రమైంది. నర్సింగ్ సిబ్బందిలోనూ 50 శాతం మందితోపాటు ప్రసూతి విభాగం హెచ్​ఓడీ సైతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇలా మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పనిచేసే వైద్యులు, సిబ్బందిలో దాదాపుగా 70శాతం మంది విధులకు దూరంగా ఉండటం వల్ల సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది.

ఆర్థికంగా స్థోమత లేనివారికి ప్రైవేటు ఆస్పత్రుల్లో కాన్పులంటేనే వణుకుపుడుతున్న రోజులివి. ఈ పరిస్థితుల్లో నిరుపేద మహిళలకు అండగా ఉంటున్న ఖమ్మం ఎంసీహెచ్ ఆస్పత్రిలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ప్రసూతి వైద్య సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీచూడండి: భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.