వ్యవసాయ చట్టాల వ్యతిరేక పోరాటంలో ప్రాంతీయ పార్టీలు కలిసి రావాలని సీపీఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలు బృంధాకారత్ సూచించారు. ఖమ్మంలో వ్యవసాయచట్టాలపై నిర్వహించిన సదస్సులో ఆమె పాల్గొన్నారు.
భాజపాతో జత కట్టిన ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని సీపీఎం నేత బృంధాకారత్ అన్నారు. ప్రాంతీయ పార్టీలను బెదిరించేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఐడీ శాఖలను వాడుకుంటుందని ఆరోపించారు. కేంద్రంపై పోరాటంలో ప్రాంతీయ పార్టీలు కలిసి పోరాడకపోతే రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని ఆమె హెచ్చరించారు.
ఇదీ చదవండి: భూదాత కాళ్లు మొక్కిన ఎమ్మెల్యే శంకర్ నాయక్