కొవిడ్ ధాటికి పలువురు మృత్యువాత పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన 'జిల్లా పవర్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్' అధ్యక్షుడు అబ్దుల్ మన్నన్(55) ఖమ్మంలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
మూడు దశాబ్దాలకు పైగా బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్‌లో పలువురు యువకులు, క్రీడాకారులకు శిక్షణ ఇచ్చారు. ఈ రంగం ద్వారా ఎందరో ఉద్యోగ అవకాశాలు పొందేలా కృషి చేశారు. జాతీయ స్థాయిలో కేరళలో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలో బంగారు పతకం సాధించారు.
బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్ పట్ల ఆసక్తి ఉన్న యువకులను ప్రోత్సహిస్తూ.. జిల్లాలోనే ఇల్లందు ప్రాంతానికి పలు బహుమతులు రావడంలో ఒక కోచ్‌గా కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన పలు పోటీల్లో ఎన్నో పతకాలు సాధించారు. మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యులుగానూ పనిచేశారు.
ఇదీ చూడండి: సామాజిక రోగనిరోధక శక్తితో కరోనాకు అడ్డుకట్ట!