ETV Bharat / city

సామాజిక సేవలో తాము సైతం... అభాగ్యులకు అండగా 'అన్నం ఆశ్రమం'

author img

By

Published : Dec 18, 2020, 5:55 AM IST

వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఎంతటి సాహసమైనా మొదటి ప్రయత్నంతోనే బీజం పడుతుంది. సామాజిక సేవే లక్ష్యంగా ప్రస్థానం మొదలుపెట్టిన అన్నం సేవా ఫౌండేషన్... ఎందరో అన్నార్థులు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. సామాజిక సేవలో తాము సైతం అంటూ మరికొందరు సంస్థకు దన్నుగా నిలుస్తూ మానవతను చాటుతున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేతులే మిన్న అంటూ... అన్నం శ్రీనివాసరావుతో కలిసి ముందుకు సాగుతున్నారు.

annam seva foundation services to needy people
annam seva foundation services to needy people
సామాజిక సేవలో తాము సైతం... అభాగ్యులకు అండగా 'అన్నం ఆశ్రమం'

మానసికస్థితి బాగోలేక రోడ్లపై తిరుగుతున్నవారు, అనాథలు, జీవితంపై ఆశలు కోల్పోయిన అశక్తులు .... ఇలా వీధినపడ్డ అభాగ్యులను అక్కున చేర్చుకుని వారి జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసాదిస్తోంది ఖమ్మంలోని అన్నం సేవా ఆశ్రమం. దశాబ్ద కాలం క్రితం అనాథలు, అభాగ్యులకు సేవ చేయడమే లక్ష్యంగా సామాజికవేత్త అన్నం శ్రీనివాసరావు నెలకొల్పిన ఈ ఆశ్రమంలో..... తొలి నాళ్లలో కేవలం 20 మందికి ఆశ్రయం కల్పించేవారు. క్రమంగా ఫౌండేషన్‌ సేవలు విస్తరించి ప్రస్తుతం 350 మంది శారీరక, మానసిక దివ్యాంగులకు ఆపన్నహస్తం అందిస్తున్నారు. సామాజిక సేవే లక్ష్యంగా ప్రయాణం మొదలుపెట్టిన అన్నం శ్రీనివాసరావు..... సవాళ్లు, ఒడిదుడుకులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు.

మానవసేవే మాధవసేవ అన్న అక్షరసత్యాన్ని ఆచరణలో చూపుతున్న అన్నం శ్రీనివాసరావు బాటలో నడిచేందుకు తాము సైతం అంటూ పలువురు ముందుకొచ్చారు. అభాగ్యులు, అన్నార్థులకు అండగా... అన్నం శ్రీనివాసరావుకు దన్నుగా నిలుస్తూ పరిమళించిన మానవతా హృదయంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పదేళ్ల క్రితం ‍ఒక్కరితో ప్రారంభమైన ఆశ్రమంలో నేడు దాదాపు 30 మంది సామాజిక కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. ఫౌండేషన్‌లోని శారీరక, మానసిక దివ్యాంగులకు అన్ని రకాలుగా సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

అన్నం సేవా ఫౌండేషన్ సభ్యుల్లో మొత్తం 30 మంది ఉంటే.... వీరిలో ఆరుగురు మహిళలు, 24 మంది పురుషులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరంతా 24 గంటలూ అభాగ్యులకు సేవలందించడంలోనే నిమగ్న మవుతున్నారు. అనాథశవాలకు అంత్యక్రియలు నిర్వహించడం, కరోనా మృతులకు అన్నీ తామై అంతిమసంస్కారాలు జరిపి మానవతను ప్రదర్శిస్తున్నారు. మతిస్థిమితం లేని వారిని చేరదీసి బాగుచేసి తిరిగి వాళ్ల కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. జీవిత చరమాంకంలో ఇబ్బందులు పడ్డ ఎందరికో కొత్త జీవితాన్ని ప్రసాదించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.