భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో నీటిపారుదల శాఖ- మిషన్ కాకతీయ విభాగానికి చెందిన ఏఈ నవీన్ కుమార్ అనిశాకు చిక్కారు. గుత్తేదారు నుంచి రూ.1.2 లక్షలు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు.
చెరువు, ఇతర పనులకు సంబంధించిన రూ.20 లక్షల బిల్లుల చెల్లింపు కోసం ఏఈ నవీన్ గుత్తేదారు నుంచి రూ.1.2 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఇష్టం లేని గుత్తేదారు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు.
ఇల్లందులోని సుభాష్ నగర్లో ఏఈ అద్దెకు ఉంటున్న నివాసంలో లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నట్లు అనిశా డీఎస్పీ మధుసూదన్ తెలిపారు.
ఇవీచూడండి: సీజ్ చేసిన మద్యంతో పోలీసుల విందు.. వీడియో వైరల్..!