ప్రేమించి రెండేళ్లు శారీరకంగా వాడుకొని పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ ఓ యువతి ఖమ్మం జడ్పీ కూడలిలో ఆందోళన చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లకు చెందిన యువకుడు దేవేందర్ తాను ప్రేమించుకున్నామని హైదరాబాద్కు చెందిన ఓ యువతి తెలిపింది.
రెండేళ్లుగా కరీంనగర్, ఖమ్మంలో కలిసి సహజీవనం చేస్తున్నామని తెలిపింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకురావడం వల్ల నిరాకరించి తప్పించుకు తిరుగుతున్నాడని యువతి ఆరోపిస్తోంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడంలేదని... అతనికే సహకరిస్తున్నారని యువతి కన్నీటి పర్యంతమైంది.