సాగర్ కాలువలో ఈతకు వెళ్లిన చిన్నారుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. ఖమ్మంలో నగరంలోని యూపీహెచ్ కాలనీకి చెందిన ఐదుగురు చిన్నారులు సాగర్ కాలువలో ఈతకు వెళ్లారు. ఒడ్డున ఆడుకుంటూ లోతులోకి వెళ్లారు. ప్రవాహంలో కొట్టుకుపోతుండగా అక్కడే ఉన్న యువకుడు ముగ్గురు పిల్లల్ని కాపాడాడు. మరో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన చిన్నారులు కోమ్ము నందకిశోర్(12), జటంగీ నితిన్(11) ఇళ్ల వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి.
ఇదీ చదవండి: దొంగలు అనుకుని మూకదాడి- ముగ్గురు మృతి