కరీంనగర్ జిల్లా చొప్పదండిలో తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గులాబీ జెండా ఎగురవేశారు. అనంతరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు.
ప్రతిమ వైద్య కళాశాల ఇంఛార్జ్ డాక్టర్ అమిత్ ఆధ్వర్యంలో దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కార్యకర్తలు భౌతిక దూరాన్ని పాటిస్తూ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.