ఎన్నో ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లు(Field Assistants)గా పనిచేసిన తమను నిర్దాక్షిణ్యంగా విధుల్లోంచి తొలగించారని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యామలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 18 నెలల నుంచి ప్రభుత్వానికి తమ గోడు విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు.
ఇప్పటికైనా తమను విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇవ్వకపోతే.. హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election nomination)లో రోజుకు వేయి మందితో నామినేషన్ వేయిస్తామని(Field Assistants) హెచ్చరించారు. సోమవారం నుంచి విడతలవారీగా క్షేత్ర సహాయకులు నామినేషన్లను సమర్పిస్తారని, ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేసుకున్నామన్నారు. తాము రాష్ట్ర వ్యాప్తంగా 7,651 మందిమి ఉన్నామని, ఇందులో 3,600 మంది దళిత సామాజిక వర్గానికి చెందిన వారని పేర్కొన్నారు. వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని.. లేనిపక్షంలో ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి ఓటమే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు యాదగిరి, తిరుపతి, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీల అభ్యున్నతికి దళితబంధు పథకం ప్రవేశపెట్టామని చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎస్సీ ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగం నుంచి ఎందుకు తొలగించారు. 7651 క్షేత్రసహాయకుల్లో.. 3600 మంది ఎస్సీలే ఉన్నారు. దుబ్బాక, నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారంలో తమ సేవలు వినియోగించుకున్న సీఎం, మంత్రులు.. తమ గోడు ఎందుకు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad by election nomination)లోనూ తమ సేవలు ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. అసెంబ్లీలో కేసీఆర్.. ఉపాధిహామీ క్షేత్ర సహాయకులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.
- శ్యామలయ్య, ఉపాధిహామీ క్షేత్రసహాయకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు