హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని సీఈవో శశాంక్ గోయల్ వెల్లడించారు. అన్ని పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయని.. ఫిర్యాదులపై ఎన్నికల పరిశీలకులు వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. కొన్ని ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలు సీజ్ చేస్తున్నామని వెల్లడించారు. కరీంనగర్‌లోని డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశామని.. రాష్ట్ర, కేంద్ర పోలీసు బలగాలతో భద్రత ఉంటుందని తెలిపారు.
స్ట్రాంగ్ రూం వద్ద అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు ఉండవచ్చని చెప్పారు. ఇవాళ ఉదయం వరకు 3.60 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 84.5 శాతం ఓటింగ్ నమోదయిందని.. అప్పటితో పోలిస్తే ఈ ఉపఎన్నికలో పోలింగ్ శాతం పెరిగిందన్నారు. రాత్రి ఏడు గంటలవరకు 86.33 శాతం పోలింగ్ నమోదయిందన్నారు. ఓటర్లలో చైతన్యం పెరిగినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు శశాంక్ గోయల్ తెలిపారు.
ఇదీచూడండి: ముగిసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్