కరీంనగర్ నగరంలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మణికంఠ రెడ్డి ఆరోపించారు. ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల ప్రహరీ గోడను ఆనుకొని నగర పాలక సంస్థ కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేశారు. గోడను ఆనుకొని ఉన్న ఇంటి యజమాని ఆ స్థలాన్ని కబ్జా చేసినట్లు వివరించారు. కళాశాల భూములు కాపాడాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలకు దారి తీస్తున్నాయి. డీఎస్‌డీవో అశోక్ కుమార్ కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు.
ఇదీ చూడండి: నీట మునిగిన వరంగల్ స్వయంభు శివాలయం