ETV Bharat / city

work from home: ఏడాదిగా ఇంటిపట్టునే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

లాక్‌డౌన్ వల్ల అనేక రంగాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నా.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో(software employees) మాత్రం సానుకూల దృక్పథం కనిపిస్తోంది. ఇంటి నుంచి పనిచేయడం(work from home) తో కుటుంబానికి దగ్గరగా ఒత్తిళ్లకు దూరంగా ఉన్నామని చెబుతున్నారు. ఉరుకుల పరుగుల జీవితం నుంచి కొంత ఉపశమనం దొరికిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వర్క్‌ ఫ్రం హోం
work from home
author img

By

Published : May 28, 2021, 5:46 AM IST

కరోనా కారణంగా ఏడాదిగా ఇంటిపట్టునే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు

కరోనాతో యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల(software engineer) కొలువుల్లో మార్పులేకపోయినా.... వారి నిత్యజీవితంలో ఒత్తిళ్లు మాత్రం దూరమయ్యాయి. కరీంనగర్‌ జిల్లాలో దాదాపుగా ఏడాది నుంచి అనేకమంది ఉద్యోగులు ఇంటి నుంచే విధులు(work from home) నిర్వర్తిస్తున్నారు. కన్నవారి ప్రేమానురాగాల మధ్య...ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు సహా అనేక చోట్ల కుటుంబానికి దూరంగా ఉండే వారంతా... ఇప్పుడు ఇంటిపట్టునే ఉంటూ కుటుంబ మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన కొత్తలో ఇంట్లో వారికి దూరంగా వెళ్లడం... ప్రయాణ భారంతో మొదట్లో ఒత్తిడికి గురయ్యే వారమని యువ ఇంజినీర్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఎంతో తేలికగా పని చేసుకోగలుగుతున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

విభిన్న అభిప్రాయాలు..

కరోనా పరిస్థితుల్లో తల్లిదండ్రుల యోగక్షేమాలపై ఆందోళనతో... వేరే చోట ఉండటం కొంత ఇబ్బందిగా అనిపించేదని... పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం వారి బాగోగులు స్వయంగా చూసుకోగల్గుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మాత్రం విభిన్న అభిప్రాయాలు వెలిబుచ్చారు. కార్యాలయంలో వేగంగా పనిపూర్తి చేసేవాళ్లమని....తోటి ఉద్యోగులతో సమన్వయం బాగుండేదని చెప్పారు.

కరోనా కారణంగా వర్క్‌ ఫ్రం హోం బాగానే ఉన్నా... అనేక మంది జీవితాలను అల్ల కల్లోలం చేస్తున్న వైరస్‌ పీడ త్వరగా తొలిగిపోవాలని యువ ఉద్యోగులు కోరుకుంటున్నారు.

ఇవీ చూడండి: police treatment: వింటారా..? ఐసోలేషన్‌లో ఉంటారా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.