ETV Bharat / city

శాతవాహన వర్సిటీకి వీసీని నియమించాలి : ఎస్ఎఫ్ఐ - shatavahana university

శాతవాహన యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శనిగారపు రజినీ డిమాండ్ చేశారు. విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో రెగ్యూలర్ వీసీ నియమించి అధిక బడ్జెట్ కేటాయించాలన్నారు.

శాతవాహన వర్సిటీకి వీసీని నియమించాలి : ఎస్ఎఫ్ఐ

author img

By

Published : Sep 5, 2020, 8:03 PM IST

కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ ఏర్పడి ఎన్నో ఏళ్లు గడిచినప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శనిగారపు రజినీ మండిపడ్డారు. ఉమ్మడి జిల్లాలో నలుగురు మంత్రులు ఉన్నా అసెంబ్లీ సమావేశాల్లో వర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో వర్సిటీకి రెగ్యులర్ వీసీ నియమించాలని అధిక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు.

బ్యాంక్ ఏర్పాటు చేయాలి..

యూనివర్సిటీకి విద్యార్థులు వెళ్లాలంటే బస్సు సౌకర్యం కూడా లేదన్నారు. విద్యార్థులు డీడీ తీయాలంటే వర్సిటీ సమీపంలో బ్యాంక్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. యూనివర్సిటీలో ఉన్న సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. వర్సిటీలోని సమస్యలను పరిష్కరించాలటే శాశ్వాత ఉపకులపతి తప్పకుండా ఉండాలన్నారు. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయాలని స్పష్టం చేశారు. తక్షణమే యూనివర్సిటీ సమస్యలను పరిష్కరించాలన్నారు.

మెడికల్ కళాశాల ఏది ?

ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని ఎద్దేవా చేశారు. యూనివర్సిటీకి రెగ్యులర్ వీసీని నియమించుకుంటే ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేల ఇంటిముందు నిరసన దీక్షలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గజ్జల శ్రీకాంత్, జిల్లా సహాయ కార్యదర్శి పోచంపల్లి రాజేష్, మురళి, అనిల్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి : టీచర్ల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతోంది: బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.