ETV Bharat / city

huzurabad by elections: హుజూరాబాద్​లో మూటలు, ముఠాలతో తిరుగుతున్నరు: రేవంత్​రెడ్డి

తెరాస గెలిస్తే మహా అయితే పింఛన్లు పెరుగుతాయని.. అదే కాంగ్రెస్​ గెలిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై అవగాహన ఉన్న వెంకట్​ గెలిస్తే.. కేసీఆర్​ పక్కలో బళ్లెంలా తయారవుతారని రేవంత్ చెప్పారు. గతంలో జరిగిన ఎన్నికల్లో తెరాస, భాజపాలకు అవకాశం ఇచ్చారని.. హుజూరాబాద్​లో మాత్రం కాంగ్రెస్​కు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.

pcc chief revanth reddy
pcc chief revanth reddy
author img

By

Published : Oct 8, 2021, 3:59 PM IST

Updated : Oct 8, 2021, 5:46 PM IST

హుజూరాబాద్​లో సమస్యలపై పోరాటం చేసేందుకే 28 ఏళ్ల యువకుడు, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్​ను బరిలో దింపినట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి వెల్లడించారు. హుజూరాబాద్​ ఉపఎన్నికలో కాంగ్రెస్​ అభ్యర్థి బల్మూరి వెంకట్​ నామినేషన్​ వేశారు. ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్​, పార్టీ సీనియర్​ నేత పొన్నం ప్రభాకర్​తో కలిసి (huzurabad bypoll nominations)నామపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రోడ్​షోలో రేవంత్​ పాల్గొన్నారు. నాడు దివంగత రాజశేఖర్​రెడ్డి.. నాటి ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​ను బరిలో నిలిపితే.. కరీంనగర్​ ప్రజలు ఆశీర్వదించారని గుర్తుచేశారు. అలానే నేడు కాంగ్రెస్​ నేతలంతా కలిసి... నేటి ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్​ను బరిలో నిలుపుతున్నామని.. ప్రజలు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వెంకట్​ ఎంపిక ఓ చారిత్రాత్మక నిర్ణయంగా రేవంత్​ అభివర్ణించారు.

నాడు పొన్నం గెలిచి.. తెలంగాణ తీసుకొచ్చారన్న రేవంత్​రెడ్డి(tpcc chief revanth reddy).. నేడు వెంకట్​ను గెలిపిస్తే.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేలా పోరాటం చేస్తారని.. కేసీఆర్​కు పక్కలో బళ్లెం లెక్క తయారవుతారని రేవంత్​రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​ నుంచి తెరాసలో చేరిన కౌశిక్​రెడ్డిపైనా పరోక్షంగా విమర్శలు చేసిన రేవంత్​.. ఉత్తమ్​ కుమార్​రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినా.. పార్టీని, నేతలను మోసం చేసేందుకు యత్నించారని మండిపడ్డారు.

మూటలు, ముఠాలో తిరుగుతున్నారు..!

చాలా మంది ఈ ప్రాంతంలో అనుకోవచ్చు.. మూటలు, ముఠాలతో తెరాస, భాజపా నేతలు ఐదు నెలలుగా తిరుగుతున్నా.. కాంగ్రెస్​ మాత్రం అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించిందని.. కానీ తమది ప్రజాసమస్యలపైనే పోరాటం రేవంత్​ స్పష్టం చేశారు.

వారు గెలిస్తే మహా అయితే..

గతంలో జరిగిన ఉపఎన్నికలు, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో తెరాస, భాజపా అభ్యర్థులను గెలిపించారని.. ఈ ఒక్కసారికి కాంగ్రెస్​కు అవకాశం ఇవ్వాలని రేవంత్​ విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్​లో తెరాస, భాజపాలు గెలిస్తే... వారికే లాభం చేకూరుతుందన్న రేవంత్​.. అదే కాంగ్రెస్​ విజయం సాధిస్తే.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం బల్మూరి వెంకట్​ కొట్లాడుతారని... పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ స్పష్టం చేశారు. తెరాస గెలిస్తే మహా అయితే పింఛను మరో రెండు వేలు పెరుగుతుందని... అదే కాంగ్రెస్​ అభ్యర్థి వెంకట్​ గెలిస్తే.. 40 నుంచి 50 వేల రూపాయలతో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు.

వారేమైనా ప్రజల కోసం కొట్లాడుతున్నారా..?

ఈ సందర్భంగా కేసీఆర్​, ఈటలపైనా ఆరోపణలు చేసిన రేవంత్​.. వారేమైనా ప్రజల కోసం కొట్లాడుతున్నారా.. అంటూ ప్రశ్నించారు. ఒకప్పటి మిత్రులు హరీశ్​, ఈటల నేడు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారని.. చెప్పిన రేవంత్​ వారిద్దరినీ తోడు దొంగలుగా అభివర్ణించారు.

తనకు అవకాశం ఇవ్వాలని.. హుజూరాబాద్​ (huzurabad congress candidate) కాంగ్రెస్​ అభ్యర్థి బల్మూరి వెంకట్​ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు జైలుకు వెళ్లినట్లు చెప్పిన వెంకట్​.. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు తనకు తెలుసని.. ఒక్కసారి అవకాశం ఇస్తే.. ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై కొట్లాడుతానని స్పష్టం చేశారు.

huzurabad by elections: హుజూరాబాద్​లో మూటలు, ముఠాలతో తిరుగుతున్నరు: రేవంత్​రెడ్డి

ఇదీచూడండి: Huzurabad By Election 2021: హుజూరాబాద్​లో తెరాస, కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్

Last Updated : Oct 8, 2021, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.