ETV Bharat / city

'రైతే రాజనే నినాదాన్ని రాష్ట్రంలో వాస్తవం చేస్తున్నాం' - niranjan reddy on agricalture

రైతే రాజనే నినాదాన్ని రాష్ట్రంలో వాస్తవం చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు. కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానంలో నూతనంగా నిర్మించిన భవానాన్ని మంత్రి గంగుల కమలాకర్​తో కలిసి ప్రారంభించారు. వంగడాల పరిశోధన, మార్కెటింగ్ కోసం శాస్త్రవేత్తలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

'రైతే రాజనే నినాదాన్ని రాష్ట్రంలో వాస్తవం చేస్తున్నాం'

author img

By

Published : Jul 11, 2020, 2:25 PM IST

కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానంలో రూ .1.90కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. కరీంనగర్, నిజామాబాద్ మొక్కజొన్న పంటకు అనువైన ప్రాంతాలని మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు. దిగుబడులు ఇచ్చే హైబ్రిడ్ వంగడాల పరిశోధనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. వ్యవసాయ రంగంపై దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. రైతే రాజనే నినాదాన్ని రాష్ట్రంలో వాస్తవం చేస్తున్నామని తెలిపారు.

వంగడాల పరిశోధన, మార్కెటింగ్ కోసం శాస్త్రవేత్తలతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అందులో భాగంగానే నియంత్రిత సాగు విధానం తొలి అడుగుగా భావిస్తున్నామని వివరించారు. అప్పులు లేని రైతులు.. అప్పులు లేని రాష్ట్రం దిశగా ముందుకెళ్తున్నామన్న మంత్రి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి కూడా అనుసంధానం చేయాలని కోరినట్లు చెప్పుకొచ్చారు. మట్టిని నమ్ముకున్న వారి సమస్యలు త్వరగా తీరడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పూర్తయితే కోటి నుంచి కోటి 25 లక్షల ఎకరాలు సాగు చేయొచ్చన్నారు. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలని మంత్రి సూచించారు. క్రమపద్ధతిలో వ్యవసాయం చేస్తే సరళంగా మార్కెటింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని రైతులంతా అర్థం చేసుకోవాలిని విజ్ఞప్తి చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.