ETV Bharat / city

'కరోనా లక్షణాలున్న వారిని గుర్తించేలా కియోస్క్‌' - karimnager news

కరోనా విస్తరిస్తున్న క్రమంలో సంక్రమణను అడ్డుకొనే దిశగా కొత్త ఆవిష్కరణలు మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నాయి. ప్రజలు పెద్దెత్తున గుమిగూడే ప్రాంతాల్లో బాధితుల వివరాల్ని పక్కాగా నమోదు చేసే ఆవిష్కరణకు కరీంనగర్‌ యువకుడు అంకురార్పణ చేశాడు. థర్మల్ స్క్రీనింగ్‌ లోపాలు బయోమెట్రిక్ విధానంలోని ఇబ్బందులను అధిగమించే విధంగా పరికరం రూపొందించాడు. యువకుడు తయారు చేసిన కొవిడ్‌-19 కియోస్క్‌‌ ఆసక్తి రేపుతోంది.

'కరోనా లక్షణాలున్న వారిని గుర్తించేలా కియోస్క్‌'

author img

By

Published : Jul 26, 2020, 6:18 AM IST

'కరోనా లక్షణాలున్న వారిని గుర్తించేలా కియోస్క్‌'

కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు వ్యాపార, వాణిజ్య సంస్థలు థర్మల్ స్క్రీనింగ్‌ను మార్గంగా ఎంచుకుంటున్నాయి. ప్రాథమికంగా శరీర ఉష్ణోగ్రత ఆధారంగా వైరస్ సోకిందా లేదా అనే విషయాన్ని అంచనా వేస్తున్నారు. అందులోనూ లోపాలు ఉన్నాయని గమనించిన కరీంనగర్‌కు చెందిన బాంబే ఐఐటీ విద్యార్థి సుశాంత్‌రెడ్డి.... సరికొత్త ఆవిష్కరణ చేశాడు. వైరస్‌ లక్షణాలను గుర్తించేలా కొవిడ్‌-19 కియోస్క్‌ను తయారు చేశాడు. ఈ యంత్రం పలువురిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ యంత్రం ముందు నిలబడితే.. శరీర ఉష్ణోగ్రత, ఫోటోతోపాటు రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని కొలుస్తుంది. వందలాది మంది వచ్చిపోయే ప్రాంతాల్లో వైరస్‌ నివారణకు ఈ యంత్రం ఉపకరిస్తుందని సుశాంత్‌రెడ్డి వివరించారు.

ఎంతమంది వివరాలనైనా..

ప్రధానంగా రద్దీగా ఉండే ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, బ్యాంకులు, ప్రైవేట్‌ కంపెనీల్లో ఈ పరికరం ఉపయుక్తంగా ఉండనుంది. 5 మెగాపిక్సెల్ కెమెరాతో పనిచేసే ఈ యంత్రం.. ఎంతమంది వివరాలనైనా నమోదు చేసి భద్రపరుస్తుంది. అంతేకాకుండా మిషన్‌లోనే పొందు పరచిన శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవచ్చు. ఆరోగ్యసేతు యాప్‌లోని వివరాలనూ అనుసంధానించేందుకు వీలుకల్పించారు. ఈ యంత్రం సామర్ధ్యాన్ని బట్టి రూ.60 వేల నుంచి రూ.1.25లక్షల వరకు ధర ఉంటుందని సుశాంత్‌రెడ్డి తెలిపారు.

వైద్యులు సంతృప్తి..

అన్‌లాక్ ప్రక్రియలో ఈ యంత్రం ఎంతో ఉపకరిస్తోందని వైద్యులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కియోస్క్‌ వాడటం వల్ల కరోనా విస్తరించకుండా జాగ్రత్తపడే అవకాశం ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు.

మరింత ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి యంత్రాన్ని ఇంకా సమర్థంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని ఆవిష్కర్తలు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.