సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలోని రాచన్నపేటలో శ్రీనివాస్ అనే వ్యక్తిపై నుంచి మున్సిపాలిటీ నీటి ట్యాంకర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడని మృతి చెందాడని బంధువులు ఆందోళనకు దిగారు.
విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ విక్రమసింహా రెడ్డి మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం, డబుల్ బెడ్రూం ఇల్లు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.