అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిన మున్సిపల్ మంత్రే వాటికి వత్తాసు పలుకడం దురదృకరమని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైరాబాద్లోని హిమాయత్‌సాగర్, గండిపేట క్యాచ్మెంట్ ఏరియాలో నిర్మాణాలు చేపట్టొద్దని ఇచ్చిన 111 జోవోను కేటీఆర్ తుంగలో తొక్కి, 25 ఎకరాల్లో విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. జీవోను అమలు చేయాలని అడిగినందుకు కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టడం సిగ్గుచేటన్నారు.
అక్రమ నిర్మాణాలు తొలగించాలంటే... మంత్రి కేవలం లీజుదారుడు మాత్రమేనని అనుచరులు చెప్తు సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని జీవన్‌రెడ్డి విమర్శించారు. ఫ్లెక్సీలు కట్టినందుకు లక్ష రూపాయలు జరిమానా విధించిన కేటీఆర్‌కు ఎలాంటి శిక్ష విధించాలని ప్రశ్నించారు. పీసీసీ రేసులో ఉన్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు... పార్టీ మారతారని ప్రచారం చేయడం భావ్యం కాదన్నారు.
ఇదీ చూడండి: 'పోచమ్మ తల్లిమీద ఒట్టేస్తారా...జరిమానా కడతారా'