హుజూరాబాద్ ఉపఎన్నికల్లో తెరాస గొప్ప విజయం సాధించబోతోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. హుజూరాబాద్ ఓటర్లు చైతన్యాన్ని ప్రదర్శించారని హరీశ్ పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఓటు హక్కును వినియోగించుకోవడం వారి చైతన్యానికి నిదర్శనమన్నారు. ఈ మేరకు ఓటర్లకు హరీశ్‌రావు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ మార్గదర్శకం.. హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో ఘనవిజయం సాధించబోతున్నామన్నారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో అధికార తెరాస తరఫున మంత్రి హరీశ్‌రావు అన్నీ తానై వ్యవహరించారు. పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌రావును వెంటబెట్టుకొని వీధి వీధి తిరిగారు. ఈటల వెంట ఎవరూ వెళ్లకుండా వ్యూహరచన చేశారు.
ఇదీచూడండి: Bandy sanjay: 'తెరాస ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. భాజపా భారీ మెజార్టీతో గెలవబోతోంది'