ETV Bharat / city

రైతులను అవమానించడం క్షమించరాని నేరం: ఈటల - మంత్రి ఈటల తాజా వార్తలు

రైస్‌ మిల్లర్లు పద్దతి మార్చుకోవాలని మంత్రి ఈటల సూచించారు. పండిన పంట మిల్లులకు తరలించే క్రమంలో అవగాహన లేని వారు రైతాంగాన్ని చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. రైతులను అవమానించడం క్షమించరాని నేరమన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేసినా, వెకిలి వేషాలు వేసినా శిక్షిస్తామని హెచ్చరించారు.

minister eetala serious on rice miller owners in karimnagar
రైతులను అవమానించడం క్షమించరాని నేరం: ఈటల
author img

By

Published : Apr 21, 2020, 7:26 PM IST

రైతు శ్రేయస్సే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో కల్వరీ టెంపుల్‌ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. పలువురు చర్చ్‌ల పాస్టర్లు, మంత్రి ఈటల రాజేందర్‌, కల్వరీ టెంపుల్‌ వ్యవస్థాపకులు సతీశ్‌కుమార్‌తో కలిసి పేదలకు నిత్యావసరాలు అందజేశారు.

ఈ సీజన్‌లో రాష్ట్రంలో భూమికి బరువయ్యే పంటలు పండాయన్నారు. పండిన పంట మిల్లులకు తరలించే క్రమంలో అవగాహన లేని వారు రైతాంగాన్ని చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. కోతల పేరుతో బేరాలకు దిగుతున్నారని పేర్కొన్నారు. రైతుల మీద ఆధారపడి మనం బతుకతున్నామని, రైస్‌ మిల్లుల మీద ఆధారపడి అన్నదాతలు బతుకరని స్పష్టం చేశారు.

రైతులను ఇబ్బందులకు గురి చేస్తే, వెకిలీ వేషాలు వేస్తే వారిని తప్పకుండా శిక్షిస్తామని హెచ్చరించారు. రైతులను అవమానించడం క్షమించరాని నేరమన్నారు. ఇది మంచి పద్దతి కాదని మంత్రి ఈటల హితవు పలికారు. పద్దతి మార్చకోవాలని మిల్లర్లకు హెచ్చరించారు. తెలంగాణ గడ్డ మీద పండిన ప్రతి గింజను కొంటున్నామన్నారు.

ఇదీ చదవండి: 'ఆ లక్ష మంది వలస కార్మికుల పరిస్థితేంటి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.