ప్రపంచ దేశాలను వణికిస్తున్న సమస్య కరోనా అని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆయన మాట్లాడారు. చైనాలో గుర్తించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందన్నారు. విమానాశ్రయాలలో చైనా నుంచి వచ్చే ప్రయాణికులను ప్రత్యేక యంత్రాలతో పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోని ఫీవర్, గాంధీ, ఛాతీ ఆస్పత్రుల్లో ఐసోలేటెడ్ వార్డులను ఏర్పాటుచేసినట్లు తెలిపారు.
ఇప్పటికి చైనా నుంచి 52 మంది మన విమానాశ్రయాలకు వచ్చినట్లు మంత్రి చెప్పారు. 25 మంది నుంచి శాంపిళ్లను సేకరించామని, ఇందులో 21 మందికి కరోనా వైరస్ లేదని నిర్ధరణ అయినట్లు పేర్కొన్నారు. ఇంకా నలుగురి పరీక్షల నివేదికలు రావాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్ లక్షణాలు గుర్తించలేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: విస్తరిస్తున్న కరోనా-వణుకుతున్న ప్రపంచదేశాలు