ప్రజాప్రతినిధులు, అధికారుల పదవులకు ప్రజలే హక్కుదారులని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. పురపాలిక పరిధిలోని 23, 29వ వార్డుల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయా వార్డుల్లోని పలు వీధుల్లో పర్యటించి పారిశుద్ధ్యం, ఇతర సౌకర్యాలను పరిశీలించారు.
మురుగు కాలువల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిపడా నిధులున్నా.. నిర్మాణాలు అసంపూర్తిగా ఎందుకు విడిచిపెడుతున్నారంటూ అధికారులను నిలదీశారు.
తల్లి దండ్రుల నుంచి తనకు మంత్రి పదవి రాలేదని.. ప్రజలు ఓట్లు వేస్తేనే వచ్చిందన్నారు. అధికారులు ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయాలని హితవుపలికారు. మున్సిపాలిటీలో సరిపడా నిధులున్నాయని.. అన్ని వసతులు మెరుగుపరచుకుందామని స్పష్టం చేశారు.
ఇవీచూడండి: నేటి నుంచే పట్టణ ప్రగతి... పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపే లక్ష్యం