తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెద్దపెల్లిలో ఘనంగా జరిగాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కలెక్టరేట్లో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. అంతకుముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, పెద్దపల్లి కలెక్టర్ శ్రీ దేవసేన, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి , జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుతో పాటు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: అవతరణ వేడుకల్లో కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి