నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. సుమారు వెయ్యి ట్రాక్టర్లతో రైతులు ఇబ్రహీంపట్నం మండలం గండి హనుమాన్ ఆలయం నుంచి కోరుట్ల సాయిబాబా ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. దేశంలోని రైతులందరు గర్వించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. రైతుల కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. అనంతరం రైతులతో పాటు తెరాస నాయకులతో కలిసి ఎమ్మెల్యే నృత్యం చేశారు.
ఇవీచూడండి: జిల్లా ఇంటర్ విద్యాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు