ETV Bharat / city

అపోహలు వద్దు.. ఆస్తుల నమోదు మాత్రమే: మేయర్

author img

By

Published : Oct 4, 2020, 1:45 PM IST

ఆస్తుల నమోదు కోసమే ధరణి పోర్టల్​ తప్ప... ఎలాంటి అపోహలు అవసరం లేదని కరీంనగర్ మేయర్ సునీల్ రావు తెలిపారు. ఆస్తులకు సంబంధించి ప్రభుత్వం పాసుపుస్తకాలు ఇవ్వనున్నట్టు వివరించారు. దీనిపై ప్రజలకు ఉన్న పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చిన సునీల్​ రావుతో ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి.

karimnagar mayor sunil rao interview with etv bharat on asserts entry in dharani
అపోహాలు వద్దు.. ఆస్తుల నమోదు మాత్రమే: మేయర్

ధరణి ద్వారా ఆస్తుల నమోదుకు ఎలాంటి అపోహలు అవసరం లేదని... కేవలం ఆస్తులకు సంబంధించి పాస్‌బుక్కులు ఇవ్వడానికే ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోందని కరీంనగర్ మేయర్ సునీల్‌ రావు స్పష్టం చేశారు. ఇంటి యజమాని అందుబాటులో లేకున్నా ఫోన్‌ ద్వారా సమాచారం సేకరిస్తున్నామన్నారు. నగరంలో దాదాపు 72వేల ఇళ్లు ఉన్నాయని... వాటి వివరాలు 10 రోజుల్లోగా సేకరించేందుకు 180 మంది అధికారులను నియమించినట్లు తెలిపారు.

ఇప్పటికే లే అవుట్‌ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు లే అవుట్‌ రెగ్యులర్ స్కీంలో దరఖాస్తు చేసుకోవల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయా ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకున్నా... ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకొని, బీఆర్‌ఎస్‌ ప్రకటించినప్పుడు ఆ భవనాన్ని కూడా క్రమబద్దీకరించుకొనేందుకు వీలుంటుందన్నారు.

ఇదీ చూడండి: కసరత్తు ముమ్మరం: 11 అంశాలతో పాసుపుస్తకాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.