ETV Bharat / city

ఇండోనేషియా ప్రచారకుల వివరాల సేకరణలో రామగుండం పోలీసులు - ఇండోనేషియా మతప్రచారకుల సమాచార సేకరణ

ఇండోనేషియా మత ప్రచారకులకు సంబంధించిన సీసీ ఫుటేజీ వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. వారు రామగుండం రైల్వే స్టేషన్​ నుంచి ఎలా వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

indonasia tourists cc footage retrive at ramagundam railway station
ఇండోనేషియా మత ప్రచారకుల వివరాల సేకరణ
author img

By

Published : Mar 19, 2020, 5:52 PM IST

కరీంనగర్​కు వచ్చిన ఇండోనేషియా మత ప్రచారకులకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. హజ్రత్ నిజాముద్దీన్ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్​ప్రెస్​లో వచ్చి పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్​కు చేరుకున్నారు. ఆ తర్వాత ఎవరెవరిని కలిశారు, రైల్వే స్టేషన్​ నుంచి కరీంనగర్​కు ఎలా చేరుకున్నారన్న దానిపై సీసీ ఫుటేజీ వివరాలు సేకరిస్తున్నారు.

రైల్వే స్టేషన్ సమీపంలోని మదర్సాలోకి వెళ్లారా? మదర్సా వ్యక్తులే వచ్చి మత ప్రచారకులను కలిశాలా? అని ఆరా తీస్తున్నారు. రామగుండం రైల్వే స్టేషన్​కు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సమాచారం వెంటనే తెలియజేయాలని పోలీసులు కోరుతున్నారు. అంతే కాకుండా మరో నాలుగైదు రోజుల పాటు రైల్వే స్టేషన్​ నుంచి ఆటోలు నడపవద్దని పోలీసులు సూచించారు.

ఇండోనేషియా మత ప్రచారకుల వివరాల సేకరణ

ఇదీ చూడండి: నిర్భయ దోషులకు ఉరి తప్పదు... సుప్రీం కీలక వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.