ప్రజల్లో కరోనా భయం తగ్గిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఫలితంగా జాగ్రత్తలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కేసులు తగ్గుతున్నా.. ప్రమాదం మాత్రం వెంటాడుతూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నా.. జౌషధాల్లో నాణ్యత పాటించడం లేదన్న ఆరోపణలను ఈటల తోసిపుచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్లాలని.. ప్రైవేటు దవాఖానాలకు పోవద్దని సూచించారు. కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఉంటుందంటున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటలతో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
ఇవీచూడండి: కరోనా పరీక్షలు, సెరో సర్వేలు పెంచాలి: మోదీ