ప్రతిమ ఫౌండేషన్, హీలింగ్ లిటిల్ హార్ట్స్ లండన్ వారి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఏడాదికి రెండు సార్లు గుండె శస్త్ర చికిత్సలు ప్రతిమ ఆసుపత్రిలో ఉచితంగా చేస్తున్నారు. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1వరకు 18 మంది పిల్లలకు లండన్ వైద్య బృందం డాక్టర్ నన్నపనేని రమణ ఆధ్యర్యంలో ఆపరేషన్లు చేశారు. చికిత్స జరిగిన పిల్లల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రో ఫ్లెమింగ్ హాజరయ్యారు.
అరుదైన గుండె శస్త్ర చికిత్సలు చేయించుకోవటానికి ఆర్థికంగా స్తోమత లేనివారికి లిటిల్ హార్ట్స్ , ప్రతిమ ఫౌండేషన్ వారి చొరవ గొప్పదని ఈటల అభినందించారు. జిల్లా వాసైన డాక్టర్ నన్నపనేని రమణ లండన్ వైద్య వృత్తిలో ఉండి లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ద్వారా పేదలకు చికిత్స అందించటం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో డాక్టర్ రమణ చేయాలని మంత్రి కోరారు.