ETV Bharat / city

కరీంనగర్ కమిషనరేట్ పరిధి​లో డ్రోన్​ల నిఘా - డ్రోన్లతో లాక్​డౌన్​ పర్యవేక్షణ

కరీంనగర్​ కమిషనరేట్​ పరిధిలో లాక్​డౌన్​ అమలు తీరును పోలీసులు డ్రోన్​ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. అనవసరంగా వీధుల్లోకి వచ్చే వ్యక్తులు, వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కేసులు నమోదైతే... భవిష్యత్తులు విద్య, ఉద్యోగా, ఉపాధి, పాసుపోర్టుకు అనర్హులవుతారని సీపీ హెచ్చరించారు.

drones observation in karimnagar  commissionerate limits
కరీంనగర్ కమిషనరేట్ పరిధి​లో డ్రోన్​ల నిఘా
author img

By

Published : Apr 17, 2020, 8:42 PM IST

లాక్​డౌన్ అమలులో భాగంగా నిర్ణీత సమయాల్లో మినహా ఎక్కడ ఎవరైనా అనవసరంగా బయటకు వచ్చినా, గుమికూడినా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్ కెమెరాలు గుర్తిస్తున్నాయి. వెంటనే ఆయా ప్రాంతాల్లో విధుల్లో ఉన్న వివిధ విభాగాలకు చెందిన పోలీసులు నిమిషాల వ్యవధిలో చేరుకునేలా అప్రమత్తం చేస్తున్నాయి. వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం, పోలీస్ స్టేషన్లకు తరలించే పక్రియ కొనసాగుతోంది. లాక్​డౌన్, కర్ఫ్యూను ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ వాహనం, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించే వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

అత్యవసరమైతే ఆధారాలు తీసుకొని నిర్ణీత సడలింపు సమయంలోనే ప్రజలు బయటకు రావాలని సీపీ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. ప్రయాణికులను చేరవేసే వాహనాలు రోడ్లపైకి వస్తే జరిమానా విధించడమే కాకుండా సీజ్​ కూడా చేస్తున్నట్టు వివరించారు. కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలతో వీధుల్లోకి వచ్చిన వారిని గుర్తించడం, ఆ ప్రాంతానికి నిమిషాల వ్యవధిలో పోలీసులు చేరుకునే దృశ్యాలు మీడియాకు విడుదల చేశారు. కట్టుదిట్టంగా అమలు చేస్తున్న చర్యలను ఉల్లంఘించే వారిపై కేసులు నమోదైతే వారికి భవిష్యత్తులో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పాస్ పోర్టుకు అనర్హులవుతారని హెచ్చరించారు.

కరీంనగర్ కమిషనరేట్ పరిధి​లో డ్రోన్​ల నిఘా

ఇదీ చూడండి: సీసీసీకి రామోజీరావు విరాళం.. కృతజ్ఞతలు తెలిపిన చిరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.