కరోనా వ్యాధి రోజురోజుకు విజృంభిస్తోంది. వ్యాధి వ్యాప్తి చెందకుండా పలువురు కరోనా మాస్కులు ఉచితంగా పంచుతున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పదవ తరగతి పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులకు జాతీయ స్థాయి చెస్ క్రీడాకారిణి రామగిరి శాన్వి మాస్క్లు పంపిణీ చేసింది. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ కరోనా రాకుండా జాగ్రత్త తీసుకోవాలని సూచించింది.
ఇదీ చూడండి: కరోనాపై ఐక్యంగా పోరాడదాం.. 'జనతా కర్ఫ్యూ'ను పాటిద్దాం