Nag Panchami 2022: నాగులపంచమి సందర్భంగా కరీంనగర్లోని ఓ దేవాలయంలో జంతు పరిరక్షణ సంఘం అవగాహన కార్యక్రమం చేపట్టింది. నాగులపంచమిని పురస్కరించుకొని భక్తులు.. పుట్టల దగ్గర పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాములు పాలు తాగవని.. భక్తి పేరుతో రకరకాల పదార్థాలు పుట్టల్లో వేయొద్దని వివరించారు. పుట్టల్లో పాలు పోస్తే కన్నాలు మూసుకుపోయి పాములో మృతి చెందుతాయని జంతు ప్రేమికుల పరిరక్షణ సంఘం సభ్యుడు సుమన్ అవగాహన కల్పించారు. కరీంనగర్లోని యుద్ధ పెరుమాళ్ స్వామి దేవాలయంలో నగరవాసులు భక్తిశ్రద్ధలతో పెద్దఎత్తున పూజలు నిర్వహించారు. పుట్టలో పాలు పోసి తెల్ల జొన్నలు నైవేద్యంగా సమర్పించారు.
భక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పుట్టలు కూలిపోయి.. పాములో అందులోనే చనిపోతాయని సుమన్ అవగాహన కల్పించాడు. పాము పాలు తాగదని తెలిసినప్పటికీ.. పుట్టలో పాలు పోయడం మూర్ఖత్వమని తెలిపారు. కరీంనగర్ జిల్లా జంతు పరిరక్షణ సంఘం సభ్యులు సుమన్.. పాములను చంపవద్దని కోరారు. ఎక్కడైనా పాము కనిపించినట్లయితే తన నెంబర్కు ఫోన్ చేయాలని వివరించారు.
"పాములు అసలు పాలు తాగవు. అలాంటిది.. భక్తులంతా కలిసి పుట్టల్లో పాలు పోస్తున్నారు. కొబ్బరికాయలు, పండ్లు, నైవేద్యాలు.. ఇలా రకరకాల పదార్థాలను పుట్టల్లో వేస్తున్నారు. వాటి వల్ల.. పుట్ట మూసుకుపోయి.. పాములు అందులోనే చనిపోతాయి. ఇలా పుట్టల్లో కాకుండా.. విగ్రహాలకు పాలు, నైవేద్యాలు పెట్టండి. ఎక్కడైనా పాములు కనిపించినా చంపకుండా.. జంతు పరిరక్షణ సభ్యులకు ఫోన్ చేయండి." - సుమన్, జంతుపరిరక్షణ సంఘం సభ్యుడు
ఇవీ చూడండి: