లాక్డౌన్ కారణంగా పనులు నిలిచిపోయిన తరుణంలో కూలీలు ఇంటిబాట పట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 28 మంది వలస కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. వీరంతా హైదరాబాద్ నుంచి ఝార్ఖండ్ వెళ్తున్నట్లు గుర్తించారు. అరటి పండ్లు, మంచినీరు అందజేశారు. లాక్డౌన్ సందర్భంగా ఎక్కడి వారు అక్కడే ఉండాలని గోదావరి ఖని సీఐ రమేశ్ విజ్ఞప్తి చేశారు.
కూలీలకు కావాల్సిన వసతితో పాటు, భోజనం కూడా ప్రభుత్వమే అందిస్తొందన్నారు. సీఐ విజ్ఞప్తి లెక్కచేయని కూలీలు ఒకరి వెంట ఒకరు నడక సాగిస్తూ స్వరాష్ట్రానికి పయనమయ్యారు. వలస కార్మికులకు ఎక్కడైనా ఉంటే వారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని సీఐ పేర్కొన్నారు. వలస కార్మికులు ఎక్కడైనా కనబడే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఇవీ చూడండి: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సార్వత్రిక ఎన్నికల తరహా ఫార్ములా!