రైతులు తమ సమస్యలు దేశానికి తెలియజేయాలనుకున్నారు. ఇందుకోసం 178 మంది అన్నదాతలు లోక్‌సభ ఎన్నిక బరిలో నిలిచారు. దేశాన్ని తమ వైపు తిప్పుకున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులతో కలుపుకుని మొత్తం 185 మంది పోటీలో ఉన్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉండటం వల్ల పోలింగ్‌పై ఉత్కంఠ నెలకొంది.
186 గుర్తులు
ఇక్కడ నోటాతో కలుపుకుని మొత్తం 186 గుర్తులు ఉండగా.. ఓటర్లు చిహ్నాలను గుర్తించడం కష్టమే. అందుకే ముందుగానే జగిత్యాల, కోరుట్ల ప్రాంతాల్లో అవగాహన కల్పించేందుకు 12 ఈవీఎంలతో కూడిన నమూనా పోలింగ్ కేంద్రాన్ని ఈ నెల 4న రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ బుద్ధ ప్రకాశ్, కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్టర్ నిఖిల్‌కుమార్ జగిత్యాలలో ప్రారంభించారు.
ఓటర్ల తికమక
నమూనా పోలింగ్ కేంద్రానికి ఓటర్ల నుంచి మంచి స్పందన ఉన్నప్పటికీ కొన్ని సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ఓటు వేయడానికి కనీసం 2 నుంచి 3 నిమిషాలు సమయం పడుతోంది.. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాక.. గుర్తులను చూసేందుకు ఓటరు కొంత తికమక పడుతూ ఎక్కువ సమయం పడుతుందని చెబుతున్నారు.
మండుతున్న ఎండలు
దీనికి తోడు ఉదయం పది తర్వాత 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. ఎండ వేడిమికి ఓటర్లు గంటల తరబడి క్యూలైన్లలో ఎంత సేపు నిలుచుంటారనే సందేహం ఉంది. గత మూడు రోజుల పరిశీలనతో నిరాక్షరాస్యులు కొంత సమమం తీసుకుంటున్నారని. చదువుకున్న వారు త్వరగానే ఓటు వేస్తున్నారని.. ముందుగానే గుర్తులను, నంబర్లను వివరిస్తున్నామని జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సంపత్ చెప్పుతున్నారు. అందరి చూపు నిజామాబాద్ వైపు చూస్తున్న తరుణంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదో చూడాలి మరి. ఇవీ చూడండి: ఉగాది సంబురాల్లో భాజపా నేతలు