ETV Bharat / city

ZOONOSES DAY: మానవ జీవితాలపై ప్రభావం చూపుతున్న జునోటిక్​ వ్యాధులు - telangana varthalu

సమాజంలో జునోటిక్ వ్యాధులు అధిక మొత్తంలో రకరకాల పద్ధతుల్లో మానవ జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. జంతువుల నుంచి మానవులకు సోకే వ్యాధులను జునోటిక్ వ్యాధులు అంటారు. ఈ వ్యాధులు ముఖ్యంగా పెంపుడు జంతువుల నుంచి మానవ జీవితాల్లోకి ప్రవేశిస్తున్నాయి. వ్యాధుల నివారణ అనేది పశువైద్య శాఖకు సంబందించి విషయమే కాకపోగా ప్రజా ఆరోగ్యంతో సంబంధం గల అన్ని శాఖల బాధ్యతగా మారింది. సమన్వయం వల్లే డెన్మార్క్, ఫిన్​లాండ్​, నార్వే, స్వీడన్, కెనడా, అమెరికా వంటి దేశాల్లో బొవైన్ ట్యూబర్కులొసిస్ అనే వ్యాధిని అరికట్టగలిగారు. శాఖల్లో సమన్వయ లోపం... అవగాహన లేమి ఉన్న దేశాల్లో ఈ సమస్య పెరుగుతున్న జనాభాతో పాటే పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 154 వరకు జునోటిక్ వ్యాధులు గుర్తించిన నేపథ్యంలో అన్ని వర్గాల్లో ప్రజల్లో అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో డబ్ల్యూహెచ్​వో పిలుపు మేరకు ఏటా జులై 6న "ప్రపంచ జునోసిస్ వ్యాధుల దినోత్సవం"గా జరుపుకుంటున్నారు. కొవిడ్‌-19 నేపథ్యంలో జునోసిస్‌ దినోత్సవానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

ZOONOSES DAY: మానవ జీవితాలపై ప్రభావం చూపుతున్న జునోటిక్​ వ్యాధులు

author img

By

Published : Jul 6, 2021, 3:42 PM IST

జునోసిస్... ఒక జంతువు నుంచి మనిషికి వ్యాపించే వ్యాధి. ఓ అంటువ్యాధి. ఎబోలా వైరస్ వ్యాధి, సాల్మొనెలోసిన్ వంటి ప్రధాన ఆధునిక వ్యాధులే జునోసిస్. హెచ్‌ఐవీ అనేది కూడా 20వ శతాబ్ధం ప్రారంభంలో మానవులకు సంక్రమించే ఒక వ్యాధి అయినప్పటికీ ఇది ప్రత్యేకంగా మానవుల ద్వారా సంక్రమించే వ్యాధిగా మార్చబడింది. మానవులకు సంక్రమించే ఇన్ఫ్లూఎంజా... పక్షి ఫ్లూ, స్వైన్‌ఫ్లూ వంటివన్నీ జునోసిస్‌ కిందకు వస్తాయి. ఈ వైరస్‌లు అప్పుడప్పుడు మానవ జాతుల్లో తిరిగి కలుస్తాయి. 1918లో స్ఫానిష్ ఫ్లూ, 2009లో స్వైన్‌ ఫ్లూ, కొవిడ్‌-19 వైరస్‌లు వంటివి మహమ్మారి వ్యాధులకు కారణమయ్యాయి. ఉద్భవిస్తున్న వైరస్‌లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, పరాన్న జీవులు వంటి వ్యాధికారక క్రిముల వల్ల జునోసిస్​ సంభవిస్తుంది.

ఏది ఏమైనప్పటికీ రేబిస్‌ కుక్కల నుంచి మానవులకు సోకే ప్రాణాంతక వ్యాధి. ఒక్క ప్లేగు వ్యాధి వల్ల 1898 నుంచి సుమారు 120 లక్షల మంది ప్రజలు చనిపోయారు. ఇక రేబిస్ వ్యాధి చేసే నష్టం అంతా ఇంతా కాదు. 20 వేల మంది ప్రజలు, లక్ష వరకు పశువులు రేబిస్ వ్యాధి బారినపడి చనిపోయినట్లు నమోదైంది. 17 లక్షల మంది ప్రజానీకం రేబిస్ వ్యాధి నిరోధక టీకాలను కుక్క కాట్ల వల్ల చేయించుకున్నారు. బ్రూసెల్ల వ్యాధి వల్ల సుమారు 340 కోట్ల రూపాయల నష్టం నమోదైంది. గతంలో ప్రపంచాన్ని ఇబ్బందిపెట్టిన ఎయిడ్స్ వ్యాధి కూడా ఒకప్పుడు జంతువుల నుంచి మనుషులకు సొకిన జునోటిక్ వ్యాధిగానే చెప్పవచ్చు. కానీ, ప్రస్తుతం అది పూర్తి పరివర్తన చెంది మానవ జీవితాల్లోనే మనుగడ సాగిస్తోంది.

ఈ వ్యాధులు... అంతర్జాతీయ సమస్యే..

ఈ జునోటిక్ వ్యాధులు బాక్టీరియా, వైరస్, ఫంగస్, పరాన్న జీవులు జంతువుల నుంచి మనుషుల్లో రకరకాల మార్గాల్లో చేరి ఆయా వ్యాధులు కలిగిస్తాయి. సమజాత శారీరక, జీవన లక్షణాలు కలిగి ఉన్న జంతువులు, మానవుల మధ్యలో ఈ వ్యాధుల వ్యాప్తి సహజం. సామీప్య సహచర జీవనం ద్వారా జంతు ఉత్పత్తులైన పాలు, గుడ్లు, మాంసం వల్ల మనుషులకు జునోటిక్​ వ్యాధులు సోకే అవకాశం ఉంది. అంతే కాకుండా గాలి, నీరు ద్వారా కూడా జంతువుల నుంచి సోకే అవకాశం అధికం. ఈ జునొటిక్ వ్యాధులు ముఖ్యంగా క్షీరద జాతి జంతువుల నుంచి మనుషులకు సోకుతాయి.

పరోక్షంగా సంక్రమిస్తున్న చర్మవ్యాధులు

సుమారు 150 జునోటిక్ వ్యాధులు గుర్తించిన దృష్ట్యా ఇది అంతర్జాతీయ సమస్యగానే అన్ని ప్రపంచ దేశాలు పరిగణిస్తున్నాయి. ఆహారోత్పత్తుల రవాణా, జంతువుల చర్మాలు, ఎముకల ద్వారా తయారవుతున్న వివిధ రకాల ఉత్పత్తులైన బెల్టులు, గొంగళ్లు, ష్వెట్టర్లు, జర్కిన్లు వంటి చలి దుస్తులు, పాద రక్షలు లాంటి వాటి ద్వారా అన్ని దేశాలకు అన్ని రకాల ఈ జంతు సంబంధిత వ్యాధులు పరోక్షంగా జొరబడుతున్నాయి. రేబిస్, బ్రూసెల్లోసిస్, మెదడు వాపు వ్యాది, ఎంటమీబా, డెంగ్యూ, ఎకినోకోకస్, చాగాస్ వ్యాధి, చికెన్ గున్యా, ప్లేగు వ్యాధి, లెప్టొస్పైరా ఇతర ఫంగల్ వ్యాధులు జునోటిక్​ వ్యాధులుగా చెప్పుకొవచ్చు. వీటిలో రేబిస్ వ్యాధి అత్యంత ప్రాణాంతకమైంది. కుక్కల కాటు ద్వారా మనుషులకు చేరే ఈ వ్యాధిని పూర్తి స్థాయిలో ఏ దేశం కూడా నివారించలేకపోయింది. జంతువుల నుంచి రకరకాల చర్మవ్యాధులు కూడా మనుషులకు సోకుతున్నందున అప్రమత్తంగా ఉండాలన్నది నిపుణుల సూచన.

కారణాలేంటి?

కుక్కలు, గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, పిల్లులు, కుందేళ్లు, పక్షులు ఈ వ్యాధులను వ్యాపింపజేస్తాయి. ఆ వ్యాప్తికి కారణాలు విశ్లేషిస్తే మానవ తప్పిదాలు, వాతావరణ అసమతుల్యత ప్రతికూల పరిస్థితులే. అడవులు నరకటం, రోడ్లు వేయడం, నదులపై ఆనకట్టలు నిర్మించటం అసమతుల్యతకు కారణం. పక్షులు, జంతువులు తమ నివాసాల నుంచి మానవ నివాసాల్లోకి చొరబడి వ్యాధులకు కారణభూతమవుతున్నాయి.

మన అవసరాల కోసం జంతువులను మచ్చిక చేసుకోవడం మొదటి చర్య. రేబిస్ వ్యాధి నివారణ అనేది చాలా కష్టం. అది ఒకసారి వచ్చిందంటే ప్రాణాంతకమే. దేశవ్యాప్తంగా... ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో యాంటీ రేబిస్‌ టీకాలు పెద్దఎత్తున వేస్తున్నారు. చాలా దేశాల్లో రేబిస్ నిర్మూలించినప్పటికీ భారత్‌లో పలు రాష్ట్రాల్లో మినహా అధిక శాతం రాష్ట్రాల్లో రేబిస్‌ మరణాలు సంభవించిన దాఖలాలు లేవు. రేబిస్ వ్యాధిరహిత దేశంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇటీవల కోళ్లల్లో బర్డ్‌ఫ్లూ భయపెడుతోంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమ దెబ్బతింది. అపోహలు, అనుమానాలతో కోడి మాంసం, గుడ్ల వినియోగం పడిపోయింది. జాతీయ టీకా కార్యక్రమం కింద ఆగస్టులో 4 నుంచి 8 మాసాల ఆడదూడల్లో బ్రూసిల్లోసిస్​ వ్యాధి టీకాలు ఇచ్చేందుకు సన్నాహాలు సాగుతున్నాయని పశుసంవర్థక శాఖ వెల్లడించింది.

జునోసిస్​ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం

ప్రపంచవ్యాప్తంగా రేబిస్ వల్ల ప్రతి ఏటా సుమారు 60 వేల మంది పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. సుమారు 1.5 నుంచి 2 శాతం ప్రపంచ జనాభా ఈ కుక్కల కాటు, ఇతర జంతువుల కాటుకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో జన జీవనంలో మంచి అవగాహన ఏర్పరిచి జునోసిస్ వ్యాధుల పట్ల అప్రమత్తత పెంపొందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహా పశుసంవర్థక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పురపాలక శాఖలపై ఎంతైనా ఉంది. ప్రపంచ జునోసిస్ దినోత్సవం పురస్కరించుకుని ఇవాళ ప్రతి ఒక్కరూ పెంపుడు జంతువులను సమీపంలోని పశువైద్యశాలకు తీసుకెళ్లి రేబిస్ టీకాలు వేయించుకోవాలని పశుసంవర్థక శాఖ విజ్ఞప్తి చేసింది.

ఇదీ చదవండి: జంతు సంరక్షణ మానవాళికి రక్షాకవచం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.