ETV Bharat / city

Video Viral : ఆ వైకాపా నేతను చితక్కొట్టారు.. వీడియో వైరల్​ - వైకాపా నేతపై దాడి

ycp leaders attack: సొంత పార్టీ నేతను విమర్శించారని ఓ కార్యకర్తపై వైకాపా శ్రేణులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Video Viral : ఆ వైకాపా నేతను చితక్కొట్టాడు.. వీడియో వైరల్​

author img

By

Published : Dec 20, 2021, 5:01 PM IST

ycp leaders attack: సొంత పార్టీ నేతను విమర్శించారని ఓ కార్యకర్తపై వైకాపా శ్రేణులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా కార్యకర్త సుబ్బారావు గుప్తా.. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతల వల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని మాట్లాడారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు పార్టీ కార్యకర్తలు శనివారం అర్ధరాత్రి గుప్తా ఇంటికి వెళ్లి దాడికి ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న గుప్తా అక్కడి నుంచి పారిపోయారు. దీంతో ఇంట్లో ఉన్న మోటార్ సైకిల్​ను ధ్వంసం చేశారు.

దాడి నుంచి పారిపోయిన గుప్తా.. గుంటూరులోని ఓ లాడ్జిలో తలదాచుకుంటున్నాడు. విషయం తెలిసుకున్న వైకాపా శ్రేణులు.. లాడ్జికి వెళ్లి మరోసారి దాడికి పాల్పడ్డాయి. 'పెద్దాయననే విమర్శిస్తావా.. విశ్వాసం లేని కుక్క' అంటూ సుభాని అనే కార్యకర్త దుర్భాష లాడుతూ విచక్షణారహితంగా దాడి చేశాడు. 'తప్పయిపోయిందన్నా.., నేను చెప్పేది ఒకసారి విను. నాకు షుగర్ ఉంది. ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. నేను మీ మనిషిని' అంటూ గుప్తా ప్రాధేయపడినా వదలకుండా మోకాళ్లపై కూర్చొబెట్టి బాలినేనికి క్షమాపణ చెప్పిస్తూ వీడియో రికార్డ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Video Viral : ఆ వైకాపా నేతను చితక్కొట్టాడు.. వీడియో వైరల్​

ఇదీ చదవండి

TRS Protest Over Paddy Procurement: కేంద్రం తీరుపై భగ్గుమన్న తెరాస.. ఊరూరా చావు డప్పులతో ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.