ETV Bharat / city

Subba Rao Gupta attack: దాడి చేసిన వ్యక్తి క్షమాపణ చెబితేనే సీఎంను కలుస్తా: సుబ్బారావు గుప్తా - సుబ్బారావు గుప్తా అటాక్ న్యూస్

Subba Rao Gupta attack: ఒంగోలులోని 300 మంది రౌడీల్లో 200 మంది తనకు తెలుసని.. ఇటీవల దాడికి గురైన వైకాపా నేత సుబ్బారావు గుప్తా వ్యాఖ్యానించారు. ఏపీలోని విజయవాడ మాకినేని విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఆర్యవైశ్య ఐక్యత సభలో పాల్గొన్న ఆయన.. ఒంగోలులో చోటారాజన్ గ్యాంగ్, డి గ్యాంగ్​లు దిగాయని అన్నారు.

Subba Rao Gupta  attack
వైకాపా నేత సుబ్బారావు గుప్తా
author img

By

Published : Jan 4, 2022, 10:30 PM IST

Subba Rao Gupta attack: ఒంగోలులో చోటారాజన్ గ్యాంగ్, డి గ్యాంగ్​లు దిగాయని ఇటీవల దాడికి గురైన వైకాపా నేత సుబ్బారావు గుప్తా అన్నారు. ఏపీలోని విజయవాడ మాకినేని విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఆర్యవైశ్య ఐక్యత సభలో ఆయన పాల్గొన్నారు. తనపై జరిగిన దాడి ఘటనపై సీఐడీ విచారణ జరిపి నిందితులను శిక్షించాలని గుప్తా డిమాండ్ చేశారు. తనపై దాడి చేసినవారు ఇంకా క్షమాపణ చెప్పలేదన్న సుబ్బారావు గుప్తా..వారు క్షమాపణ చెబితేనే సీఎంను కలుస్తానన్నారు. ఒంగోలులోని 300 మంది రౌడీల్లో 200 మంది తనకు తెలుసునని అన్నారు.

"సీఐడీ విచారణ జరిపి నాపై దాడి చేసిన వ్యక్తిని శిక్షించాలి. నాపై దాడి చేసినవారు ఇంకా క్షమాపణ చెప్పలేదు. దాడి చేసిన వ్యక్తి క్షమాపణ చెబితేనే సీఎంను కలుస్తా. ఒంగోలులో చోటారాజన్ గ్యాంగ్, డి గ్యాంగ్ దిగాయి. ఒంగోలులోని 300 మంది రౌడీల్లో 200 మంది నాకు తెలుసు." -సుబ్బారావు గుప్తా, వైకాపా నేత

ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టొద్దు..

Arya vysyas meet: పార్టీలకతీతంగా ఆర్యవైశ్యులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో సభను నిర్వహించామని సభకు హాజరైన అంబికా కృష్ణ, సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. సమస్య వచ్చినప్పుడు రాజకీయ నేతల దగ్గరకు వెళ్లవద్దని సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూచించారు. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని మరొకరి కాళ్ల దగ్గర పెట్టొద్దని అన్నారు. రాజకీయాలకు తావివ్వకుండా ఐక్యతతో తమ సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించాలన్నారు.

గుప్తాపై దాడి ఎందుకు జరిగిందంటే..

attack on YCP leader: గతేడాది డిసెంబరు 12న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా కార్యకర్త సుబ్బారావు గుప్తా.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. వారు మాట్లాడుతున్న భాష, వ్యవహారశైలి అభ్యంతరకరమని.. ఫలితంగా పార్టీకి 20 శాతం వరకు ఓటింగ్‌ తగ్గుతుందని వ్యాఖ్యానించారు. ఈసారి ఎన్నికల్లో తెదేపా గెలిస్తే.. వైకాపా కార్యకర్తలను కర్రలతో తరిమి కొడతారని ఆందోళన వ్యక్తం చేశారు.

గుప్తా వ్యాఖ్యలు చేసిన అయిదు రోజుల తర్వాత పూటుగా మద్యం తాగిన 15 మందికి పైగా వ్యక్తులు లంబాడీ డొంకలోని సుబ్బారావు గుప్తా నివాసానికి రాత్రి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు. అయినప్పటికీ అతన్ని దుర్భాషలాడుతూ ఇంట్లోకి ప్రవేశించి బెదిరింపులకు దిగారు. అంతుచూస్తామని హెచ్చరిస్తూ అసభ్య పదజాలంతో దూషించారు. వారిని సుబ్బారావు గుప్తా భార్య ప్రతిఘటించటంతో అక్కడి నుంచి బయటికి వచ్చారు. సుబ్బారావు ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఉదయం నుంచి సుబ్బారావు గుప్తా అదృశ్యమయ్యారు. అతని సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ అయింది. తనపై దాడి చేస్తారని భయపడిన గుప్తా.. గుంటూరులోని ఓ లాడ్జిలో తలదాచుకున్నాడు. విషయం తెలుసుకున్న వైకాపా శ్రేణులు.. లాడ్జికి వెళ్లి మరోసారి దాడికి పాల్పడ్డారు.

'పెద్దాయననే విమర్శిస్తావా.. విశ్వాసం లేని కుక్క' అని దుర్భాషలాడుతూ సుభాని అనే కార్యకర్త విచాక్షణారహితంగా దాడి చేశాడు. 'నిన్ను ఇక్కడే చంపేస్తా' అంటూ గుప్తాపై పిడిగుద్దులు కురిపించారు.

'తప్పయిపోయిందన్నా.., నేను చెప్పేది ఒకసారి విను. నాకు షుగర్ ఉంది. ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు. నేను మీ మనిషిని. నన్ను వదిలేయండి' అంటూ గుప్తా ధీనంగా ప్రాధేయపడినా వారు కనికరించలేదు. మరింత రెచ్చిపోయి గుప్తాపై దాడి చేశారు. మోకాళ్లపై కూర్చొబెట్టి బాలినేనికి క్షమాపణ చెప్పిస్తూ వీడియో రికార్డ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఆ తర్వాత జరిగిన ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

దాడి ఘటనపై మంత్రి బాలినేని ఏమన్నారంటే..

ఒంగోలులో వైకాపా నేత సుబ్బారావు గుప్తాపై తన అనుచరులు దాడి చేసిన ఘటనపై మంత్రి బాలినేని శ్రీనివాస్ స్పందించారు. గుప్తాపై దాడి జరుగుతోందని తెలిసి తమ వాళ్లకు ఆగమని చెప్పానన్నారు. తన గురించి ఒంగోలు ప్రజలకు తెలుసునని.. దాడులు చేయడం తమ సంస్కృతి కాదని మంత్రి స్పష్టం చేశారు. మతిస్థిమితం సరిగా లేకే.. గుప్తా ఆ రోజు సభలో అలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. అతన్ని కొడుతున్నారని తెలిసి వెంటనే ఫోన్ చేసి ఆపానని వెల్లడించారు. గుప్తాపై జరిగిన దాడిని ఆర్యవైశ్య సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు ఖండించారు. ఆయన ఇంటికి వెళ్లి గుప్తాను పరామర్శించారు.

విజయవాడ మాకినేని విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఆర్యవైశ్య ఐక్యత సభ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.