ETV Bharat / city

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైకాపా - ap mlc elections updates

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల పేర్లను అధికార వైకాపా ఖరారు చేసింది. ఎమ్మెల్యేల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ సీఎం జగన్ .. సీనియర్లతో చర్చించి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

ycp
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైకాపా
author img

By

Published : Feb 25, 2021, 4:39 PM IST

ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల పేర్లను ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అనారోగ్యంతో కన్నుమూసిన ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కుమారుడు బల్లి కల్యాణ్ చక్రవర్తికి, ఎ‌మ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు చల్లా భగీరథరెడ్డికి వైకాపా అవకాశం కల్పించింది.

ఇక కడప జిల్లాకు చెందిన సి. రామచంద్రయ్య, శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్‌కు అవకాశం ఇచ్చారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గానికి చెందిన ఇక్బాల్‌ను మరోసారి మండలికి పంపాలని వైకాపా నిర్ణయించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయవాడకు చెందిన కరీమున్నిసా పేరు ఖరారు చేశారు.

ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీలకు పోటీ చేయట్లేదని సజ్జల స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాలకే అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్లు తెలిపారు.

ఇవీచూడండి: ఉత్తమ్ సమక్షంలోనే కాంగ్రెస్​ నాయకుల గొడవ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.