ETV Bharat / city

YS VIVEKA CASE: వివేకా మృతదేహానికి పోస్టుమార్టం చేసిన డాక్టర్​ను విచారించిన సీబీఐ - rims doctor anand naik

ఆంధ్రప్రదేశ్​కు చెందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. వివేకా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్​ను సీబీఐ అధికారులు విచారించారు. పోస్టుమార్టం నివేదికను మరోసారి పరిశీలించారు.

YS VIVEKA CASE: వివేకా మృతదేహానికి పోస్టుమార్టం చేసిన డాక్టర్​ను విచారించిన సీబీఐ

author img

By

Published : Aug 28, 2021, 3:39 PM IST

ఏపీకి చెందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. వరుసగా 83వ రోజూ పలువురు అనుమానితులను ప్రశ్నిస్తోంది. వివేకా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ ఆనంద నాయక్​ను సీబీఐ అధికారులు విచారించారు. పోస్టుమార్టం నివేదికను మరోసారి అధికారులు పరిశీలించారు.

  • సునీల్ యాదవ్‌కు నార్కో పరీక్షలపై విచారణ వాయిదా..

వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్​కు నార్కో అనాలసిస్ పరీక్షల అనుమతి కోసం సీబీఐ దాఖలు చేసిన పిటిషన్​పై జమ్మలమడుగు కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. 45 నిమిషాల పాటు ఇరు పక్షాల న్యాయవాదులు ఆన్​లైన్​లో వాదనలు వినిపించారు. వాదనలు విన్న జమ్మలమడుగు మెజిస్ట్రేట్.. విచారణను వచ్చే నెల 1కి వాయిదా వేసింది.

  • ఇది వరకే రివార్డు ప్రకటన..

వివేకా హత్య కేసులో కచ్చితమైన, నమ్మకమైన సమాచారం ఇచ్చిన వారికి రూ.5 లక్షల బహుమానం ఇస్తామని ఇప్పటికే సీబీఐ ప్రకటించింది. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురయ్యారని.. హైకోర్టు ఆదేశాల మేరకు గతేడాది జులై 9న వివేకా హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీబీఐ ప్రకటనలో పేర్కొంది. సామాన్య ప్రజలు ఎవరైనా సమాచారం అందించవచ్చని.. అలాంటి వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సీబీఐ ప్రకటనలో తెలిపింది. వివేకా హత్యకు సంబంధించి.. తెలిసిన సమాచారం సీబీఐ అధికారులైన దీపక్ గౌర్, రాంసింగ్​లకు అందజేయాలని వారి ఫోన్ నంబర్లు, చిరునామాను ప్రకటనలో వెల్లడించింది.

ఇదీ చదవండి: ys Viveka Murder Case:సునీల్ యాదవ్‌కు నార్కో పరీక్షలపై విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.