YS Sharmila Padayatra: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరిట తలపెట్టిన పాదయాత్ర తిరిగి నేటి నుంచి ప్రారంభించనున్నారు. 76 రోజుల పాటు సాగిన పాదయాత్ర... ఈ నెల 6న వాయిదా పడింది. ఈ రోజు నుంచి వాయిదాపడిన ప్రాంతం.. సత్తుపల్లి నియోజకవర్గం నుంచే మళ్లీ పాదయాత్ర కొనసాగనుంది.
ఈనెల 6న సత్తుపల్లి నియోజకవర్గంలో వాయిదా పడిన యాత్ర... మళ్లీ 77వ రోజు శనివారం అక్కడి నుంచే ప్రారంభంకానుంది. తాళ్లమడ వద్ద వెయ్యి కిలోమీటర్ల పాదయత్రకు గుర్తుకుగా పైలాన్ నిర్మించారు. ఇవాళ అక్కడ నిర్వహించే బహిరంగసభలో షర్మిల పాల్గొని ప్రసంగిస్తారు. సభ తర్వాత తాళ్లమడ మీదుగా సత్తుపల్లి, గౌరిగూడెం, సిద్ధారంగ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగిస్తారు.
ఇవీ చదవండి:పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తుల వెల్లువ.. ఆ జిల్లా నుంచే ఎక్కువ..?