ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల తలపెట్టిన పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు సందర్భంగా.. ఇవాళ నక్కలపల్లి నుంచి ఉదయం 9:30 గంటలకు పాదయాత్ర ప్రారంభమవనుంది. 10 గంటలకు నక్కలపల్లి గ్రామస్థులతో షర్మిల సమావేశం అవుతారు. 10:45 గంటలకు నక్కలపల్లి క్రాస్‌రోడ్‌కు చేరుకుంటారు. 11:30 గంటలకు వెంకటాపూర్‌కు చేరుకుంటారు.
12 గంటలకు వెంకటాపూర్‌లో మధ్యాహ్న భోజనం చేసి కాసేపు విరామం తీసుకుంటారు. తిరిగి 3 గంటలకు వెంకటాపూర్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. 3:15కు కవాడీగుడా క్రాస్‌రోడ్, 4 గంటలకు మల్కాపురం, 5 గంటలకు అందాపూర్, 5:15కు నవాజ్పూర్ క్రాస్‌రోడ్, 5:45కు కాచారం క్రాస్ రోడ్‌కు చేరుకుని 6 గంటలకు కాచారం గ్రామంలో బస చేస్తారు.
మొదటి సాగిందిలా..
నిన్న మధ్యాహ్నం చేవేళ్ల మండలంలోని శంకర్పల్లి క్రాస్‌రోడ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభ అనంతరం వైఎస్ షర్మిల పాదయాత్రను విజయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. వైఎస్ షర్మిల రెండున్నర కిలోమీటర్లు నడిచి.. షాబాద్ క్రాస్‌రోడ్‌కు చేరుకున్నారు. అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న కందవాడ గేట్ క్రాస్‌రోడ్డు వద్దకు పాదయాత్రగా చేరుకున్నారు.
అక్కడ మధ్యాన భోజనం చేశారు. గంట విరామం తర్వాత కందవాడ గేట్ క్రాస్ నుంచి పాదయాత్ర కొనసాగించారు. 6.5 కిలోమీటర్లు ప్రయాణించి కందవాడ గ్రామానికి, అక్కడి నుంచి గుండాల్ క్రాస్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి నారాయణగూడా క్రాస్‌రోడ్డుకు చేరుకున్నారు. తొలి రోజు మొత్తం 10 కిలోమీటర్ల వరకు వైఎస్ షర్మిల పాదయాత్ర పూర్తిచేశారు. మొదటిరోజు నక్కలపల్లి సమీపంలో రాత్రి బస చేశారు.
ఇదీ చూడండి: