Doctor Suicide: హైదరాబాద్ అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన అనిల్(31).. ఖమ్మం మమత మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఈ నెల 22న పెరల్ సిటీ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. ఈరోజు ఉదయం గది శుభ్రం చేసేందుకు లాడ్జి సిబ్బంది వెళ్లగా... బెడ్‌పై ఉన్న అనిల్‌ను కదిలించినా స్పందించకపోవడంతో... అనుమానం వచ్చిన సిబ్బంది లాడ్జి మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు.
మేనేజర్ వచ్చి పరిశీలించి అనిల్ చనిపోయినట్టు నిర్ధరించుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అఫ్జల్‌గంజ్ పోలీసులు... కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటన చోటుచేసుకున్న గదిలో పలు రకాల ఇంజెక్షన్లు, టాబ్లెట్లను పోలీసులు గుర్తించారు. అయితే.. యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: