ETV Bharat / city

పెళ్లి చేయాలంటే.. అనుమతి పొందాల్సిందే - కొవిడ్‌-19 నేపథ్యంలో అంటువ్యాధుల చట్టం-1897 ప్రకారం వివహాలకు దరఖాస్తు తప్పనిసరి

పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు...విందు భోజనాలు.. అనే విషయాన్ని ఈ మాయదారి కరోనా కాలంలో మరిచిపోవాల్సిందే. తహసీల్దారుకు అర్జీ పెట్టుకుంటే రెవెన్యూ సిబ్బంది విచారించి సరేనంటేనే పెళ్లి. కొవిడ్‌-19 నేపథ్యంలో అమలులో ఉన్న అంటువ్యాధుల చట్టం-1897 ప్రకారం వివాహాలకు దరఖాస్తు తప్పనిసరి చేశారు.

you-have-to-get-permission-to-get-married-due-to-diseases-act-1897-in-telangana
పెళ్లి చేయాలంటే అనుమతి పొందాల్సిందే
author img

By

Published : May 10, 2020, 6:38 AM IST

పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. తలంబ్రాలు...విందు భోజనాలు.. అనే విషయాన్ని ఈ మాయదారి కరోనా కాలంలో మరిచిపోవాల్సిందే. ‘అయ్యా! మా కుమార్తెకు పెళ్లి నిశ్చయమైంది. ఎలాంటి హంగూ ఆర్భాటం ఉండదు.. మీరెవరూ రావద్దు. మీ ఆశీస్సులున్నట్లేనని మేం అనుకుంటాం. సెలవు’ అని చెప్పుకోవాల్సిందే. ఇందుకు పెద్దా..చిన్నా మినహాయింపు లేదు. కొవిడ్‌-19 నేపథ్యంలో అమలులో ఉన్న అంటువ్యాధుల చట్టం-1897 ప్రకారం వివాహాలకు దరఖాస్తు తప్పనిసరి చేశారు. ముందుగా తహసీల్దారుకు అర్జీ పెట్టుకుంటే రెవెన్యూ సిబ్బంది విచారించి సరేనంటేనే పెళ్లి.

కొన్ని షరతులు కూడా విధిస్తున్నారు. పెళ్లికి 10 లేదా 20మంది హాజరా అనేది క్షేత్రస్థాయిలో వివాహ వేడుక ప్రాంతాన్ని పరిశీలించి రెవెన్యూ అధికారులే నిర్ణయిస్తారు. కలెక్టర్ల సూచనతో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు. పురోహితుడితో పాటు వధువు, వరుడి తరఫున ఎందరు హాజరవుతారనేది వేర్వేరుగా పేర్లతో సహా ముందుగా తెలపాలి. వ్యక్తిగత దూరం, మాస్కులు ధరించి పరిశుభ్రత పాటిస్తామని ప్రమాణ పత్రంలో పేర్కొనాలి. ఊరేగింపులు, బహిరంగ వేడుకలు, సామూహిక విందు భోజనాలు నిర్వహించబోమని హామీ పత్రం రాసివ్వాలి.

ఇదీ చూడండి: 'ఇల్లందులోని ప్రతి ఎకరాకు సాగు నీరందించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.