చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు భాగ్యనగరానికి వచ్చిన యోగి.. పాతబస్తీకి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యూపీ సీఎం స్వయంగా హారతిచ్చారు.
తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు యోగి ఆదిత్యనాథ్ వెంట ఉన్నారు. యూపీ సీఎం పర్యటన నేపథ్యంలో చార్మినార్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పలు చోట్ల కేంద్ర బలగాలను కూడా మోహరించారు.