ETV Bharat / city

ఏపీలో 356 అమలు దిశగా అడుగేయొద్దు: రఘురామకృష్ణరాజు - YCP MP RAGHURAMA KRISHNA RAJU FIRES JAGAN

ఏపీలో 356 అమలు చేసే దిశగా పయనించవద్దని సీఎం జగన్​కు ఆపార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు హితవు పలికారు. రాజ్యాంగబద్దంగా నడుచుకోవాలని అభిప్రాయపడ్డారు. అలా కాకుండా వేరుగా వెళ్తామనేందుకు ఇది రాచరిక వ్యవస్థ కాదని ఘాటుగా హెచ్చరించారు. న్యాయవ్యవస్థతో తగాదాలు వద్దని సూచించారు.

raghurama krishna raju
ఏపీలో 356 అమలు దిశగా అడుగులు వేయొద్దు: వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
author img

By

Published : Jul 24, 2020, 8:35 PM IST

కోర్టు తీర్పు వచ్చే వరకు ఏపీ ఎస్ఈసీగా రమేశ్​కుమార్‌నే కొనసాగించాలని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ఎన్నికలపై రమేశ్​కుమార్​ తీసుకున్న నిర్ణయం సరైనదేనని ప్రజలు గుర్తించారని పేర్కొన్నారు. ఏపీలో 356 అమలు దిశగా పయనించవద్దని సీఎం జగన్​కు హితవు పలికారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా పనిచేయాలని.. వమ్ము చేసుకోవద్దని సూచించారు.

"రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లడానికి ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అనుమతి లేదు. ఇది రాచరికం కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం. న్యాయస్థానాలను గౌరవిద్దాం, న్యాయవ్యవస్థ విలువను కాపాడదాం. న్యాయవ్యవస్థను కించపరుస్తున్న మా పార్టీ వారిపై మాత్రం కేసులు పెట్టడం లేదు. న్యాయవ్యవస్థను కించపరిచే వారిని మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందేమోననే అనుమానం కలుగుతోంది. కేసుల రాజ్యం వద్దు.'

- రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ

కొద్దిమంది వ్యక్తులు ఇచ్చిన సలహాలతో అరువు విమానంలో దిల్లీ వచ్చారని రఘురామకృష్ణరాజు విమర్శించారు. అనర్హుడిగా చేయాలని రాజ్యాంగంపై అవగాహన లేని వ్యక్తులు తనపై ఫిర్యాదు చేస్తే ఏమౌతుందని రఘురామకృష్ణరాజు అన్నారు. ఏపీ ప్రభుత్వానికి సూచన చేయడమే తన తప్పా.. అని ముఖ్యమంత్రి జగన్​ను ప్రశ్నించారు. 22 మంది ఎంపీలను మీకు అప్పగిస్తాం.. రఘురామకృష్ణరాజును తప్పించండని దిల్లీ వెళ్లి వేడుకున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థను దుర్భాషలాడిన తమ పార్టీ వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఏపీలో 356 అమలు దిశగా అడుగులు వేయొద్దు: వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఇవీచూడండి: 'సచివాలయం కూల్చివేత చిత్రీకరణను అడ్డుకోవద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.